నిర్భయ కేసులో కేంద్రానికి షాక్... ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

దోషులను వేర్వేరుగా ఉరి తీయాల్సిన అవసరం లేదని.. ఒకేసారి నలుగురు దోషుల్ని ఉరి తీయాలని తీర్పు ఇచ్చింది.

news18-telugu
Updated: February 5, 2020, 3:09 PM IST
నిర్భయ కేసులో కేంద్రానికి షాక్... ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నిర్భయ కేసులో కేంద్రానికి ఢిల్లీ హైకోర్టులో చుక్క ఎదురయ్యింది. పాటియాల ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. దోషులను వేర్వేరుగా ఉరి తీయాల్సిన అవసరం లేదని.. ఒకేసారి నలుగురు దోషుల్ని ఉరి తీయాలని తీర్పు ఇచ్చింది. దీంతో పాటు న్యాయపరమైన అవకాశాలకు వినియెగించుకునేందుకు దోషులకు వారం పాటు హైకోర్టు గడువు ఇచ్చింది. దీంతో నిర్బయ దోషుల కేసు క్లైమాక్స్‌కు చేరినట్లైంది.

2012లో ఢిల్లీలోని నిర్భయపై ముకేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్‌కుమార్ సింగ్ (31) సామూహికంగా అత్యాచారం చేసి ఆమె మరణానికి కారణమయ్యారు. ఈ కేసులో... నలుగురు దోషులకూ ఒకేసారి ఉరిశిక్ష వెయ్యాలనే రూల్ ఉంది. ఈ రూల్‌ని అడ్డం పెట్టుకొని దోషులు... ఒకరి తర్వాత ఒకరుగా రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకుంటున్నారు. ఫలితంగా ఫిబ్రవరి 1న అమలు కావాల్సిన ఉరిశిక్ష అమలవ్వలేదు.  దీనిపై విమర్శలు వస్తుండటంతో... కేంద్రం ఓ అడుగు ముందుకేసింది. అయితే కేంద్రానికి ఈ విషయంలో హైకోర్టు షాక్ ఇచ్చింది. పాటియాల కోర్టు ఇచ్చిన స్టేకు సమర్థిస్తూ దోషులకు మరో వారం రోజుల పాటు గడువు ఇచ్చింది.కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై శని, ఆదివారాల్లో విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ నెల 2న తీర్పును రిజర్వు చేసింది. ఇవాళ ఆ తీర్పును వెలువరించింది.

First published: February 5, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు