Nirbhaya Case: నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై... నేడు ఢిల్లీ హైకోర్టు తీర్పు

ఈ కేసులో... నలుగురు దోషులకూ ఒకేసారి ఉరిశిక్ష వెయ్యాలనే రూల్ ఉంది. ఈ రూల్‌ని అడ్డం పెట్టుకొని దోషులు... ఒకరి తర్వాత ఒకరుగా రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకుంటున్నారు.

news18-telugu
Updated: February 5, 2020, 9:40 AM IST
Nirbhaya Case: నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై... నేడు ఢిల్లీ హైకోర్టు తీర్పు
Nirbhaya Case: నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై... నేడు ఢిల్లీ హైకోర్టు తీర్పు
  • Share this:
ఎన్నో రోజులుగా ఉత్కంఠ రేపుతున్న ‘నిర్భయ’ దోషుల ఉరిశిక్ష అమలుపై  నేడు ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. నిర్భయ దోషుల ఉరిశక్ష అమలుపై స్టే విధిస్తూ పాటియాలా హౌస్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఆ విషయంపై కేంద్రం, ఢిల్లీ సర్కార్... ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌పై ఇవాళ ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. దోషుల క్షమాభిక్ష, క్యురేటివ్ పిటిషన్లు వివిధ దశల్లో పెండింగ్‌లో ఉండడం వల్ల ఉరిశిక్ష అమలుపై పాటియాలా హౌస్‌కోర్టు గత నెల 31న స్టే విధించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ సర్కారు రెండూ ఈ స్టేను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించాయి.

2012లో ఢిల్లీలోని నిర్భయపై ముకేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్‌కుమార్ సింగ్ (31) సామూహికంగా అత్యాచారం చేసి ఆమె మరణానికి కారణమయ్యారు. ఈ కేసులో... నలుగురు దోషులకూ ఒకేసారి ఉరిశిక్ష వెయ్యాలనే రూల్ ఉంది. ఈ రూల్‌ని అడ్డం పెట్టుకొని దోషులు... ఒకరి తర్వాత ఒకరుగా రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకుంటున్నారు. ఫలితంగా ఫిబ్రవరి 1న అమలు కావాల్సిన ఉరిశిక్ష అమలవ్వలేదు.  దీనిపై విమర్శలు వస్తుండటంతో... కేంద్రం ఓ అడుగు ముందుకేసింది. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఇవాళ కోర్టులో హాజరవుతారు. అత్యంత దారుణమైన నేరం చేసి కూడా దోషులకు శిక్ష పడకపోవడంపై యావత్ దేశం అసంతృప్తితో ఉందని ఆయన అన్నారు.

కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై శని, ఆదివారాల్లో విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ నెల 2న తీర్పును రిజర్వు చేసింది. ఇవాళ ఆ తీర్పును వెలువరించనుంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తం మరోమారు కోర్టు తీర్పు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇవాళ ఢిల్లీ హైకోర్టు గనక నలుగురిలో ఇద్దరికి ముందుగా ఉరిశిక్ష వెయ్యాలని సూచిస్తే... రెండ్రోజుల్లో వారికి ఉరిశిక్ష వేసే అవకాశాలుంటాయి. లేదంటే నలుగురికీ ఒకేసారి శిక్ష అమలు చేసేందుకు ప్రక్రియ చేపట్టమని కూడా సూచించే అవకాశాలున్నాయి.



First published: February 5, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు