Nirbahaya Case | ఉరి శిక్షను నిలిపివేయాలంటూ నిర్భయ కేసులో దోషులు పెట్టుకున్న పిటిషన్లను ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు కొట్టివేసింది. దీంతో నిర్భయ దోషులకు రేపు (ఈనెల 20)న ఉరి శిక్ష అమలు కానుంది. 20వ తేదీ ఉదయం 5.30 గంటలకు తీహార్ జైల్లో ఉరితీయనున్నారు. దోషులు పవన్, ముఖేష్, అక్షయ్, వినయ్ శర్మలకు ఉరిశిక్షలను అమలు చేయనున్నారు. తమ ఉరిశిక్షను నిలిపివేయాలంటూ నిర్భయ దోషులు పెట్టుకున్న పిటిషన్‌ను పాటియాలా హౌస్ కోర్టు కొట్టివేసింది. దీంతో వారి ఉరితీతకు ఎలాంటి ఆటంకం ఉండబోదని నిర్భయ తరఫు న్యాయవాది సీమా కుష్వాహా అన్నారు. ‘రేపు ఉదయం 5.30 గంటలకు ఆ నలుగురికి ఉరిశిక్ష అమలవుతుందని విశ్వసిస్తున్నా.’ అని సీమా కుష్వాహా చెప్పారు.
Nirbhaya's lawyer Seema Kushwaha: I am sure that all four convicts will be hanged at 5.30am tomorrow. https://t.co/beVuCxevnR pic.twitter.com/DexcbVNetl
— ANI (@ANI) March 19, 2020
మరోవైపు పాటియాలా హౌస్ కోర్టు ఎదుట నిందితుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ భార్య సొమ్మసిల్లిపడిపోయారు. తన భర్తను ఉరితీయవద్దంటూ ఆమె కోర్టు ఎదుట తన చెప్పులతో తాను కొట్టుకుంటూ ఏడ్చారు. అక్కడ ఉన్న మహిళా న్యాయవాదులు, కుటుంబసభ్యులు ఆమెను సముదాయించారు. ఇక తన ఉరిశిక్షను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో ముఖేష్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది.
ఈ కేసులో నలుగురు దోషుల్లో ఒకరైన పవన్ గుప్త ఉరిశిక్షకు ఒక్కరోజు ముందు పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్‌ను గురువారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2012లో నిర్భయపై సామూహిక అత్యాచారం జరిగినప్పుడు తాను మైనర్ బాలుడినంటూ పవన్ గుప్త చేసిన వాదనను కోర్టు తోసిపుచ్చింది. దీంతో మార్చి 20 ఉదయం 5.30 నిమిషాలకు నిందితులను ఉరితీయాలని ఈ నెల5న పటియాలా కోర్టు నాలుగోసారి కొత్త డెత్ వారెంట్ ను జారీ చేసింది. దీంతో రేపు దోషుల్ని తీహార్ జైల్లో ఉరితీయనున్నారు.
ఈ కేసులోని నేరస్తుల్లో ఒకరైన రామ్ సింగ్ జైలులోనే ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో కేవలం మూడేళ్ల శిక్ష అనుభవించి బోస్టన్ స్కూల్ నుంచి బయటపడి విడుదలయ్యాడు. తీహార్ జైల్లో నలుగురు దోషులైన ముఖేష్, పవన్ గుప్తా, అక్షయ్ కుమార్, వినయ్ శర్మ లను ఉరి తీయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉంటే నిర్భయ కేసులో దోషులకు ఉరి వేయాలంటే తీహార్ జైలు మాన్యువల్ ప్రకారం ఖైదీని తెల్లవారుజామునే నిద్ర లేపుతారు. మేల్కొలిపిన 10 నిమిషాల తర్వాత.. స్నానం చేయాల్సిందిగా చెబుతారు. స్నానం చేశాక.. ఎస్పీ, డీఎస్పీ, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, వైద్యాధికారి నలుగురూ కలిసి ఖైదీ ఉన్న సెల్ వద్దకు చేరుకుంటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nirbhaya case