ఏప్రిల్ 18వ తేదీన వేలం వేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. కార్ల అంచనా ధర, తయారీ సంవత్సరం, కారు మోడల్, ఫొటోలు, ఇతర డాక్యుమెంట్లను ఎంఎస్టీసీ వెబ్సైట్లో ఉంచనున్నారు.
పంజబ్ నేషనల్ బ్యాంకు స్కాంలో నేరస్థుడు నీరవ్ మోదీకి ఈడీ మరో షాక్ ఇచ్చింది. అతనికి చెందిన కార్లను వేలం వేసేందుకు సిద్దమైంది. ఇతనికి చెందని 13 ఖరీదైన కార్లను వేలం వేయాలని ఎన్ఫోర్స్ మెంట్ అండ్ డైరెక్టరేట్ అధికారులు నిర్ణయించారు. మంచి కండీషన్లో ఉన్న కార్లను వేలం వేసి డబ్బులు రాబట్టుకోవాలని ఈడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. నీరవ్‌కు చెందిన లగ్జరీ కార్లు రోల్స్ రాయ్స్ ఘోస్ట్, టొయొటా ఫార్చునర్, ఇన్నోవా, పోర్షె పనమెరా, రెండు మెర్సెడీజ్ బెంజ్, మూడు హోండా కార్లు వేలం వేసే వాటిలో ఉన్నాయి. మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన అధికారులు ఈ కార్లను సీజ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు ఈ వేలం కాంట్రాక్ట్ అప్పగించారు. ఏప్రిల్ 18వ తేదీన వేలం వేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయనకు సంబంధించిన పెయింటింగ్స్‌ని వేలం వేశారు అధికారులు. వేలం వేయగా రూ. 54.84 కోట్లు వచ్చాయి.
వేలంలో కార్లను కొనాలనుకునే వారు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలు ఈ కంపెనీ వెబ్సైట్లో ఉంచనున్నారు. కార్లు కొనాలనుకునే వారు కార్లను పరిశీలించవచ్చు. కానీ టెస్ట్ డ్రైవ్ చేయడానికి కుదరదు. వేలానికి ఒక వారం ముందుగా కొనుగోలుదారు కార్లను పరిశీలించుకునే వీలు కల్పించనున్నారు. కార్ల అంచనా ధర, తయారీ సంవత్సరం, కారు మోడల్, ఫొటోలు, ఇతర డాక్యుమెంట్లను ఎంఎస్టీసీ వెబ్సైట్లో ఉంచనున్నారు. వేలం పూర్తయిన తర్వాత కార్ల రిజిస్ట్రేషన్ కోసం కొంత గడువు ఇస్తారు. భారతదేశం వదిలిపెట్టి విదేశాల్లో దర్జాగా తలదాచుకున్న నీరవ్ మోడీ ప్రస్తుతం లండన్ జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. గత శుక్రవారం అక్కడి వెస్ట్‌మినిస్టర్ కోర్టు బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 26న తదుపరి విచారణ జరిగే వరకు నీరవ్ మోదీ వాండ్స్‌వర్త్ జైల్లోనే ఉండనున్నాడు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.