NIRAV MODI SENT TO B GRADE JAIL FACING PROBLEMS IN LONDON JAIL KA
ఫేక్ న్యూస్ కాదు...లండన్ జైల్లో నీరవ్ మోడీకి నిజంగా చిప్పకూడే..
నీరవ్ మోదీ (Image : Twitter)
ఇంతకాలం భారతీయ నిఘా వర్గాల కళ్లు గప్పి లండన్ లోని వెస్ట్ ఎండ్ ప్రాంతంలో ఖరీదైన నాలుగు బెడ్రూమ్ల ఫ్లాట్ లో నివాసమున్న నీరవ్ మోడీ, ఇప్పుడు జైలులో మరుగుదొడ్డి కోసం క్యూలో నిలుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సాధారణంగా వీఐపీ ఖైదీలకు భారతీయ జైళ్లలో సకల సౌకర్యాలు కల్పిస్తుంటారు. కానీ ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీకి సై లండన్ జైలులో మాత్రం నిజంగా చిప్పకూడే గతి పట్టింది. పలు నాటకీయ పరిణామాల నడుమ లండన్ మెట్రోపోలిటన్ పోలీసులకు చిక్కిన నీరవ్ మోడీని వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కో్ర్టులో ప్రవేశపెట్టగా, ఈ నెల 29 వరకూ రిమాండ్ లోకి తీసుకోమని డిస్ట్రిక్ట్ జడ్జ్ ఆదేశించారు. అయితే రిమాండ్ లో భాగంగా నీరవ్ మోడీని లండన్ నగరంలో అత్యంత రద్దీ కలిగిన, సౌకర్యాలు కూడా లేని సౌత్ వెస్ట్ లండన్ జైలుకు పంపించారు. అయితే జైలులో తనకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని, ప్రత్యేక సెల్ కావాలని నీరవ్ జైలు అధికారులను కోరారు. అయితే జైలులో ఖైదీల సంఖ్య అధికంగా ఉందని అందుకనే ఇతర ఖైదీలతో సెల్ పంచుకోవాల్సిందే అని అధికారులు తేల్చి చెప్పారు.
ఇంతకాలం భారతీయ నిఘా వర్గాల కళ్లు గప్పి లండన్ లోని వెస్ట్ ఎండ్ ప్రాంతంలో ఖరీదైన నాలుగు బెడ్రూమ్ల ఫ్లాట్ లో నివాసమున్న నీరవ్ మోడీ, ఇప్పుడు మరుగుదొడ్డి కోసం క్యూలో నిలుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే నీరవ్ ను బంధించిన జైలులో సాధారణంగా డ్రగ్ మాఫియాకు చెందిన నేరస్తులు, అలాగే మానసిక సమస్యలతో బాధపడుతున్న నేరస్తులను ఈ సౌత్ వెస్ట్ లండన్ లో ఉంచుతారు. అయితే వీరి నడమ తాను ఇబ్బంది పడే అవకాశం ఉందని జైలును మార్చాలని నీరవ్ అధికారులను కోరారు. అంతే కాదు మరుగుదొడ్లు సైతం చాలా అపరిశుభ్రంగా ఉన్నాయని నీరవ్ ఫిర్యాదు చేశారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.