నీరవ్ మోడీ ప్లాస్టిక్ సర్జరీ ప్లాన్ ఎందుకు సక్సెస్ కాలేదు ?

కేటుగాడు నీరవ్ మోడీ ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని పోలీసులను బురిడీ కొట్టించాలని చూశాడా.. భారత నిఘా సంస్థలకు చిక్కకుండా నీరవ్ మోడీ వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి ?

news18-telugu
Updated: March 21, 2019, 7:35 PM IST
నీరవ్ మోడీ ప్లాస్టిక్ సర్జరీ ప్లాన్ ఎందుకు సక్సెస్ కాలేదు ?
nirav modi
news18-telugu
Updated: March 21, 2019, 7:35 PM IST
లండన్‌లో అరెస్ట్ అయిన ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీ లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. బ్యాంకులను మోసం చేసి వేల కోట్లతో విదేశాలకు ఉడాయించిన నీరవ్ మోడీ, ఎలాగైనా పోలీసులకు చిక్కకూడదని చేయని ప్రయత్నం లేదు. పీఎన్‌బీ కుంభకోణం బయటపడటానికి మూడు నెలల ముందు నుంచే నీరవ్ మోడీ తప్పించుకొని తిరిగేందుకు స్కెచ్ వేశారు. పసిఫిక్ సముద్రంలో ఓ మూలన కేవలం 1700 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న స్వతంత్ర దేశం వనౌటు దేశంలో పౌరసత్వం కోసం ప్రయత్నం చేశారు. అంతే కాదు సింగపూర్ లో పర్మినెంట్ రెసిడెన్స్ కోసం కూడా ప్రయత్నించారు. ఎలాగైనా పట్టుబడకుండా ఉండాలని లండన్ లోని పెద్ద పెద్ద న్యాయ సేవా సంస్థల సహాయం పొందేందుకు పెద్ద ఎత్తు ఖర్చు పెట్టి లాయర్లను కూడా నీరవ్ కాంటాక్టులో పెట్టుకున్నాడు.

టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. చివరిగా నీరవ్ ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని ఎవరు గుర్తించకుండా అరెస్టు నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేసినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి.  ఇందు కోసం ఏర్పాట్లు కూడా చేసుకున్నారని తేలింది. ఈ లోగా విధి అడ్డం తిరగడంతో నీరవ్ మోడీ అరెస్టు అయ్యారు. అయితే నీరవ్ మోడీ దేశం వదిలి పారిపోయినప్పటి నుంచి ఆయన కదలికలపై భారత నిఘా వర్గాలు డేగ కన్ను వేశాయి. యూరప్, దుబాయ్, అమెరికా, సింగపూర్‌లో నీరవ్ ఆర్థిక లావాదేవీలన్నింటినీ సీజ్ చేశారు. అలాగే నీరవ్ కు సహకరిస్తున్న అతని సన్నిహితులు మిహిర్ భన్సాలీ, సుభాష్ పరబ్, మయాంక్ మెహతాలను సైతం అదుపులో తీసుకొని కట్టడి చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఇవి కూడా చదవండి:

ఫేక్ న్యూస్ కాదు...లండన్ జైల్లో నీరవ్ మోడీకి నిజంగా చిప్పకూడే..ఫేక్ న్యూస్ కాదు...లండన్ జైల్లో నీరవ్ మోడీకి నిజంగా చిప్పకూడే..
First published: March 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...