Home /News /crime /

NIRAV MODI ARRESTED IN LONDON

లండన్‌లో నీరవ్ మోడీ అరెస్ట్ : కోర్టులో హాజరు పరిచిన పోలీసులు

నీరవ్ మోదీ (Image : Twitter)

నీరవ్ మోదీ (Image : Twitter)

Nirav Modi Arrest In London | భారత్ లోని పలుబ్యాంకులను నిలువున ముంచేసి వేలకోట్లతో విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని లండన్ లో అరెస్టు చేశారు. రెండు రోజుల క్రితమే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ లండన్ హోమ్ శాఖకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మెట్రోపోలిటిన్ పోలీసులు నీరవ్ ను అదుపులోకి తీసుకున్నారు.

ఇంకా చదవండి ...
  భారత్ లోని పలుబ్యాంకులను నిలువున ముంచేసి వేలకోట్లతో విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ ఎట్టకేలకు లండన్‌లో అరెస్టు అయ్యారు. లండన్ కోర్టు నుంచి ఇప్పటికే అరెస్టు వారెంటు జారీ అయిన నేపథ్యంలో నీరవ్ మోడీని స్థానిక మెట్రోపొలిటిన్ పోలీసులు లండన్ లోని హాల్ బర్న్ ప్రాంతంలో అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఈ మేరకు లండన్ పోలీసులు స్టేట్‌మెంట్ విడుదల చేస్తూ భారత అధికార వర్గాల ఫిర్యాదు మేరకు నీరవ్ మోడీని అరెస్టు చేసి స్థానిక వెస్ట్ మినిస్టర్ కోర్టులో హాజరు పరిచారు. అయితే తదుపరి వాదనలు మార్చి 29న వినిపించాల్సిందిగా కేసు విచారణను కోర్టు వాయిదా వేసింది.

  సరిగ్గా 17 నెలల క్రితం నీరవ్ మోడీ పలు బ్యాంకులను మోసం చేసిన కేసు నేపథ్యంలో విదేశాలకు పరారయ్యారు. వజ్రాల వ్యాపారి అయిన నీరవ్ మోడీ, తన మేనమామ మెహూల్ చోక్సీతో కలిసి ముంబైలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు బ్రాడీ హౌస్ శాఖ నుంచి అక్రమంగా ఎల్‌ఓయూలు పొంది సుమారు రూ.14600 కోట్ల రూపాయలు డ్రా చేసుకొని బ్యాంకులకు ఎగనామం పెట్టారు. నీరవ్ దెబ్బకు దేశీయ బ్యాంకింగ్ దిగ్గజంగా పేరొందిన పీఎన్‌బీ కుదేలైంది.


  Nirav Modi, Nirav Modi arrest, london, London court arrest warrant, నీరవ్ మోదీ, లండన్, నీరవ్ మోదీపై అరెస్ట్ వారెంట్, లండన్ కోర్టు అరెస్ట్ వారెంట్,
  నీరవ్ మోడీ


  ఇప్పటికే సీబీఐ, ఈడీ సంయుక్తంగా నీరవ్ మోడీకి చెందిన కేసును సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నాయి. నీరవ్ పై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు యూకే హోంశాఖను కలిసి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు అరెస్టు వారెంట్ జారీ చేయించారు. ఇదిలా ఉంటే గత రెండు రోజుల క్రితమే మారువేషంలో గుబురు మీసంతో నీరవ్ మోడీ లండన్ వీధుల్లో దర్శనమివ్వడంతో అంతా అవాక్కయ్యారు. ప్రముఖ బ్రిటీష్ డెయిలీ టెలిగ్రాఫ్ నీరవ్ ను గుర్తించి లండన్‌లో ఉంటున్నట్లు ప్రకటించింది.

  పలు నేరపూరిత ఆర్థిక వ్యవహారాల్లో నీరవ్ మోడీ ప్రస్తుతం లండన్‌లో ఖరీదైన ప్రాంతమైన సెంటర్ పాయింట్ టవర్ బ్లాక్ సమీపంలో త్రీ బెడ్‌రూమ్ ఫ్లాట్ లో ప్రతీ నెల 17 వేల పౌండ్లు చెల్లిస్తూ నివాసముంటున్నట్లు వార్తా కథనాలు వెలువడ్డాయి.

  ఇదిలా ఉంటే సీబీఐ, ఈడీ ఇప్పటికే నీరవ్ కు చెందిన రూ.1873 కోట్ల విలువైన ఆస్తులను పీఎంఎల్ఏ చట్టం కింద అటాచ్ చేసింది. అలాగే నీరవ్ కుటుంబానికి చెందిన రూ.489 కోట్ల ఆస్తులను సైతం సీజ్ చేశారు. కాగా ఇదే కేసుకు సంబంధించిన మరో నిందితుడు మెహూల్ చోక్సీ మాత్రం ఇంకా విదేశాల్లోనే పరారీలో ఉన్నారు.

  Nirav Modi, Nirav Modi arrest, london, London court arrest warrant, నీరవ్ మోదీ, లండన్, నీరవ్ మోదీపై అరెస్ట్ వారెంట్, లండన్ కోర్టు అరెస్ట్ వారెంట్,
  నీరవ్ మోడీ (File)


  నీరవ్ మోడీని భారత్‌కు రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం : ఈడీ అధికారులు

  లండన్‌లో అరెస్టయిన ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీని భారత్ తీసుకువచ్చేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తామని అధికారులు తెలిపారు. అంతే కాదు ఇప్పటికే నీరవ్ మోడీని స్వాధీనం చేసుకొని విచారణ జరిపేందుదు భారతీయ లీగల్ టీమ్ లండన్ లో సిద్ధంగా ఉందని, వీలైతే ఈడీ అధికారులు లండన్ వెళ్తారని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. అలాగే విదేశాల్లో తలదాచుకుంటున్న మరో ఆర్థిక నేరగాడు మెహూల్ చోక్సీ అప్పగింతపై కూడా ఆంటిగ్వా కోర్టులో పిటిషన్ వేసి, సంబంధిత సాక్ష్యాధారాలతో సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు.
  First published:

  Tags: Nirav Modi, PNB Scam

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు