లండన్ జైలులో నీరవ్ మోడీ.. హోలీ వేడుకలు ఎలా జరుపుకున్నాడో తెలుసా..?

news18-telugu
Updated: March 22, 2019, 7:19 PM IST
లండన్ జైలులో నీరవ్ మోడీ.. హోలీ వేడుకలు ఎలా జరుపుకున్నాడో తెలుసా..?
Nirav Modi
news18-telugu
Updated: March 22, 2019, 7:19 PM IST
ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీ అరెస్టు అయి లండన్ లోనే అత్యంత రద్దీ కలిగిన జైలులో వేశారు. అంతే కాదు అక్కడ నీరవ్ ప్రత్యేక సెల్ కావాలని ఆర్జీ పెట్టుకోగా అలాంటివేవీ కుదరవని జైలు అధికారులు తేల్చిచెప్పేసారు. ఇదిలా ఉంటే నీరవ్ మోడీకి ఎంతో ప్రీతి పాత్రమైనా హోలీ వేడుకలను ప్రతీ సంవత్సరం ఘనంగా సెలబ్రిటీల నడుమ జరుపుకోవడం అలవాటు. ఏటా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన స్నేహితులు, బంధువులు, హాలివుడ్, బాలివుడ్ సెలబ్రిటీలతో హోలీ వేడుకలను నీరవ్ మోడీ అంగరంగ వైభవంగా జరుపుకునేవారు. అయితే ప్రస్తుతం పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో అరెస్టు అయి లండన్ జైలులో ఉన్న మోడీ హోలీ పర్వదినం రోజు ఒంటరిగానే గడిపేశారు. అంతేకాదు నీరవ్ మోడీకి జైలులో సహఖైదీగా అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీం సన్నిహితుడు ఉండటం కొసమెరుపు.

అయితే నీరవ్ మోడీ ఉంటున్న జైలు ఇప్పటికే సామర్థ్యానికి మించి ఖైదీలతో రద్దీగా మారిపోయింది. ఒక్కో సెల్‌లో 2 నుంచి 4గురు ఖైదీలను ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో తనకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని మొరపెట్టుకున్నా వినే నాథుడే లేకపోయాడు. ఇదిలా ఉంటే నీరవ్ మోడీ తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేశారు. అప్పటి వరకూ నీరవ్ మోడీ రిమాండ్ లో గడపాల్సిందే.

First published: March 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...