హోమ్ /వార్తలు /క్రైమ్ /

గుంటూరు జిల్లాలో దారుణం.. విద్యార్థినిపై రేప్..

గుంటూరు జిల్లాలో దారుణం.. విద్యార్థినిపై రేప్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధ యువకుడు.

    ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధ యువకుడు. ఈ ఘటన జిల్లాలోని పొన్నూరు మండలం ములుకుదురు గ్రామంలో చోటుచేసుకుంది. విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డ యువకుడు.. విషయం తల్లిదండ్రులకు చెబితే చంపేస్తానని హెచ్చరించాడు. భయం భయంతోనే ఆ యువతి జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. వారి సహాయంతో పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను ఆలస్యం చేశారని బాధితురాలి తల్లిదండ్రులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని బాలిక తల్లిదండ్రులు రూరల్ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు.

    Published by:Shravan Kumar Bommakanti
    First published:

    Tags: AP News, Crime, Crime news, Guntur rape case

    ఉత్తమ కథలు