ఈస్టర్ వేడుకల సందర్భంగా శ్రీలంక రాజధాని కొలంబోతో పాటు పలు ప్రదేశాల్లో వరుసగా ఎనిమిది ఆత్మాహుతి బాంబు పేలుళ్లు సంభవించిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 359 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అందులో 10 మంది భారతీయులు కూడా ఉన్నారు. దాడులపై ముమ్మర దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇప్పటి వరకు 60 మందికి పైగా అరెస్టు చేశారు. అయితే, బాంబు పేలుళ్లకు పాల్పడినవాళ్లు ఎనిమిది మంది అని ఇప్పటి వరకు చెప్పిన శ్రీలంక సర్కారు తాజాగా మొత్తం తొమ్మిది మంది ఆత్మాహుతి దళ సభ్యులు అని ప్రకటించింది. వారిలో ఓ మహిళ కూడా ఉందని పోలీసులు తెలిపారు.
ఇక, పేలుళ్లు నేషనల్ తహ్వీద్ జమాత్ పనేనని ఇప్పటి వరకు చెబుతూ వచ్చని శ్రీలంక రక్షణ సహాయ మంత్రి రువాన్ విజేవర్ధనే.. ఆ ఉగ్రవాద సంస్థ ఈ దాడులకు పాల్పడలేదని, ఆ సంస్థకు చెందిన ఓ వర్గం పనేనని వెల్లడించారు. అయితే, విదేశీ ఉగ్రవాద సంస్థలతో దానికి సంబంధాలు ఉన్నయా? లేవా? అన్నది తేలాల్సి ఉందని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bomb blast, Columbo Bomb Blast, Sri Lanka, Sri Lanka Blasts, Terror attack, Terrorism