• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • NINE PERSONS HAVE BEEN ARRESTED IN A CASE OF STEALING RS 3 CRORE THAT WAS TAKEN TO ERNAKULAM AS ELECTION FUND FOR A NATIONAL PARTY SSR

తెల్లవారుజామున 4.30కు హైవేపై ఓ కారు వెళుతోంది.. టోల్ ప్లాజా దగ్గరకు రాగానే.. పెద్ద ట్విస్టే ఇది..!

తెల్లవారుజామున 4.30కు హైవేపై ఓ కారు వెళుతోంది.. టోల్ ప్లాజా దగ్గరకు రాగానే.. పెద్ద ట్విస్టే ఇది..!

ప్రతీకాత్మక చిత్రం

కేరళలోని సినీ ఫక్కీలో ఓ జాతీయ పార్టీకి చెందిన ఎలక్షన్ ఫండ్‌ను లూటీ చేసిన దుండగులను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.3.5 కోట్ల సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఈ భారీ చోరీకి పాల్పడింది హవాలా గ్యాంగ్‌గా పోలీసులు తేల్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఏప్రిల్ 3న తెల్లవారుజామున 4.30 గంటలకు...

  • Share this:
    త్రిస్సూర్: రవితేజ హిట్ మూవీ ‘కిక్’లో పార్టీ ఫండ్‌ను దొంగిలించే సీన్ గుర్తుందా. సినిమా కాబట్టి.. పైగా ‘కిక్’ మూవీ కాబట్టి ఆడియన్స్‌కు కిక్ ఇచ్చేలా ఈ సీన్‌లో పలు ట్విస్టులను జొప్పించి ఆసక్తికరంగా తెరకెక్కించాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. హీరో ఆ పార్టీ ఫండ్‌ను లూటీ చేసింది కూడా ఓ మంచి పని కోసమే కనుక ప్రేక్షకులు కూడా హీరోను మెచ్చుకుని సినిమాను హిట్ చేశారు. కానీ.. నిజ జీవితంలో జనాలకు స్వార్థం ఎక్కువ కాబట్టి వారి బాగు కోసం ఓ జాతీయ పార్టీకి చెందిన ఫండ్‌ను లూటీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే.. అక్కడ సినిమా అవడం మూలాన రవితేజ దొరికిపోలేదు. ఇది రియల్ లైఫ్ కావడంతో నిందితులు దొరికిపోయారు. కేరళలోని సినీ ఫక్కీలో ఓ జాతీయ పార్టీకి చెందిన ఎలక్షన్ ఫండ్‌ను లూటీ చేసిన దుండగులను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.3.5 కోట్ల సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఈ భారీ చోరీకి పాల్పడింది హవాలా గ్యాంగ్‌గా పోలీసులు తేల్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఏప్రిల్ 3న తెల్లవారుజామున 4.30 గంటలకు జాతీయ పార్టీకి చెందిన రూ.3.5 కోట్ల పార్టీ ఫండ్‌తో ఓ వాహనం కోడకర నేషనల్ హైవేపై వెళుతోంది. సరిగ్గా.. ఆ కారు త్రిస్సూర్-ఎర్నాకులం నేషనల్ హైవేపై ఉన్న పలియెక్కర టోల్ ప్లాజా వద్దకు రాగానే ఆ వాహనాన్ని అప్పటికే వెంబడిస్తున్న ఏడుగురు కారును ఆపి డబ్బు దోచుకెళ్లారు. టోల్ ప్లాజా వద్ద ఉన్న సిబ్బంది ఆ గూండాలు వెళుతున్న కారును ఆపేందుకు ప్రయత్నించగా.. రోడ్డుపై ఉన్న బారికేడ్లను ఢీ కొట్టుకుంటూ మరీ ఆపకుండా దుండగులు పరారయ్యారు.

    పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. ఈ దృశ్యాలు కనిపించాయి. ఏప్రిల్ 4న కొజికొడెకు చెందిన ఒక వ్యక్తి తను భూమి కొనేందుకు కారులో రూ.25 లక్షలు తీసుకుని వస్తుండగా దుండగులు తనను వెంబడించి ఆ డబ్బును దోచుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు లోతుగా విచారణ జరపగా.. ఓ జాతీయ పార్టీకి చెందిన రూ.3.5 కోట్లను దుండగులు దోచుకెళ్లారని.. రూ.25 లక్షలని ఆ వ్యక్తి అబద్ధం చెప్పినట్లు తెలిసింది.

    ఇది కూడా చదవండి: Radha Krishna Wife: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ రాధాకృష్ణ కుటుంబంలో విషాదం
     కేసును విచారించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు లూటీకి పాల్పడిన ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడుగురితో పాటు దోపిడికి సాయపడ్డ మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. తలస్సెరి, కన్నూర్‌కు చెందిన వారు ఇద్దరు కాగా.. ఈ ఇద్దరిలో ఒకరు ఇరింగలకుడలోని అద్దె ఇంట్లో గ్యాంగ్‌తో కలిసి ఉంటున్నట్లు పోలీసులు తేల్చారు.



    ఇది కూడా చదవండి: IndiaFightsCorona: ఇక కరోనా ఖతమేనా.. ఇది వాడితే కరోనా వైరస్‌కు మూడినట్టేనట..!

    త్రిస్సూర్‌లోని కొడలికి చెందిన ఓ వ్యక్తిని ఈ హవాలా గ్యాంగ్ సాయం కోరినట్లు పోలీసుల విచారణలో తేలింది. సాయం చేసినందుకు రూ.10 లక్షలు ఇచ్చేలా డీల్ కుదిరిందని పోలీసులు తెలిపారు. ఎన్నికల్లో డబ్బు పంచేందుకు తీసుకెళ్లుతున్న రూ.3.5 కోట్లను దోపిడి చేసేందుకు ఈ గ్యాంగ్ యత్నించి విఫలమైంది. అయితే.. ఈ డబ్బంతా ఓ జాతీయ పార్టీకి చెందిన లెక్కలోకి రాని సొత్తుగా గుర్తించిన పోలీసులు.. ఆ పార్టీ ఏదనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచారు.
    Published by:Sambasiva Reddy
    First published: