హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking Incident: వామ్మో.. వామ్మో.. ఇదెక్కడి బరితెగింపురా బాబోయ్.. ఈ దృశ్యాలు ఎక్కడివంటే...

Shocking Incident: వామ్మో.. వామ్మో.. ఇదెక్కడి బరితెగింపురా బాబోయ్.. ఈ దృశ్యాలు ఎక్కడివంటే...

రైడ్స్‌లో పట్టుబడిన మహిళలు, విటులు

రైడ్స్‌లో పట్టుబడిన మహిళలు, విటులు

దేశంలో ఎక్కువగా పర్యాటకులు విజిట్ చేసే ప్రాంతాల్లో ఒకటి పాండిచ్చేరి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ప్రాంతాల నుంచి ఈ ప్రాంతానికి ఎక్కువగా పర్యాటకులు వెళుతుంటారు.

పాండిచ్చేరి: దేశంలో ఎక్కువగా పర్యాటకులు విజిట్ చేసే ప్రాంతాల్లో ఒకటి పాండిచ్చేరి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ప్రాంతాల నుంచి ఈ ప్రాంతానికి ఎక్కువగా పర్యాటకులు వెళుతుంటారు. నయనానందకరమైన ప్రకృతి అందాలు, సుందరమైన సముద్ర తీరంతో పాటు భారతి పార్క్, అరవింద్ ఆశ్రమ్, నోనాన్కుప్పంలో బోటింగ్ చేస్తూ పర్యాటకులు సేద తీరుతుంటారు.

బిజీ లైఫ్‌లో పరుగుకు కాస్త బ్రేక్ చెప్పి కుటుంబాలతో కలిసి ప్రశాంతంగా గడుపుదామని పాండిచ్చేరికి వెళ్లే పర్యాటకులతో పాటు మద్యం తక్కువ ధరకు దొరుకుతుందని అక్కడికి వెళ్లి చిల్ అయ్యే బ్యాచ్ కూడా ఉంటుంటారు. అక్కడికి వెళ్లే యువతనే టార్గెట్‌గా చేసుకుని ఓ కొత్త దందాకు కొందరు తెరలేపారు.

ఇది కూడా చదవండి: Shameful Incident: ఈ అమ్మాయి చేసిన పనికి ఏమనాలి అసలు.. ఇంత నీచమైన ఆలోచన ఎలా వచ్చిందో...

కుటుంబాలతో కాకుండా స్నేహితులతో వచ్చే కుర్రకారుకు వలపు వల వేసి డబ్బు సంపాదించుకోవాలనే నీచపు ఆలోచనకు ఓ గ్యాంగ్ తెరలేపింది. అలాంటి ఓ వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు అక్కడి పోలీసులు. బయటకు బ్యూటీ సెలూన్ల పేరుతో లోపల వ్యభిచారం చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డబ్బు దండిగా వస్తుండటంతో కొందరు అమ్మాయిలు, మహిళలు ఈ రొంపిలోకి దిగుతున్నారు. ఇలాంటి ముఠాల దగ్గర మామూళ్లు తీసుకుని కొందరు పోలీసులు కూడా సహకరిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Married Daughter: షాకింగ్ ఘటన.. అల్లుడిని కాదనుకుని పుట్టింటికి వచ్చిన కూతురు అఫైర్ పెట్టుకుందని...

వ్యభిచారం జరుగుతోందన్న సమాచారంతో అక్టోబర్ 16న పాండిచ్చేరిలోని అన్నా నగర్, మారైమలై అడిగల్ రోడ్, కామరాజ్ రోడ్‌లోని మూడు ప్రాంతాల్లోని మూడు మసాజ్ పార్లర్లపై పోలీసులు రైడ్స్ చేశారు. లోపల.. దిమ్మతిరిగే దృశ్యాలు కనిపించాయి. ఒకే మహిళతో ఇద్దరి రాసలీలలు, ఒకే గదిలో ఇద్దరమ్మాయిలతో గడుపుతున్న యువకుడు.. ఇలా పోలీసుల రైడ్స్‌లో 10 మంది మహిళలు, 9 మంది విటులు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. ఈ మసాజ్ పార్లర్ల లైసెన్స్‌లను రద్దు చేయాల్సిందిగా పాండిచ్చేరి మున్సిపాలిటీకి పోలీసులు ఇప్పటికే లేఖ పంపారు. దీంతో.. పాండిచ్చేరి మున్సిపల్ కమిషనర్ శివకుమార్, రెవెన్యూ అధికారి సాంబశివమ్ మరియు సిబ్బంది ఆ మసాజ్ పార్లర్లను సీజ్ చేశారు. వాటి లైసెన్స్‌లను కూడా రద్దు చేస్తున్నామని ప్రకటించారు.

First published:

Tags: Prostitution, Prostitution racket, Puducherry, Sex Racket

ఉత్తమ కథలు