• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • NINE PEOPLE HAVE BEEN SENTENCED TO DEATH IN THE 2016 GOPALGANJ HOOCH TRAGEDY CASE AND 4 GET LIFE SRD

Death Sentence : కల్తీసారా ఘటనలో స్పెషల్ ఎక్సైజ్ కోర్టు సంచలన తీర్పు.. 9 మందికి మరణ శిక్ష..

Death Sentence : కల్తీసారా ఘటనలో స్పెషల్ ఎక్సైజ్ కోర్టు సంచలన తీర్పు.. 9 మందికి మరణ శిక్ష..

ప్రతీకాత్మక చిత్రం

Death Sentence : కల్తీ సారా విషాదం కేసులో స్పెషల్ ఎక్సైజ్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నాటు సారా విషాదం కేసులో తొమ్మిది మందికి మ‌ర‌ణ‌శిక్ష‌ విధిస్తూ ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది.

  • Share this:
    కల్తీ సారా విషాదం కేసులో స్పెషల్ ఎక్సైజ్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 2016 లో బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో జ‌రిగిన నాటు సారా విషాదం కేసులో తొమ్మిది మందికి మ‌ర‌ణ‌శిక్ష‌ విధిస్తూ ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ఒకే కేసులో ఇంత మందికి ఉరిశిక్ష పడటం ఇదే తొలిసారి. దీంతో పాటు ఈ కేసులో మ‌రో న‌లుగురు మ‌హిళా నిందితుల‌కు యావ‌జ్జీవ కారాగా శిక్ష‌ను ఖ‌రారు చేసింది. జీవితకాల శిక్ష ప‌డిన మ‌హిళ‌ల‌కు ప‌ది ల‌క్ష‌ల జ‌రిమానాను కూడా విధిస్తూ న్యాయస్థానం తీర్పును వెలువరించింది. 2016 ఆగస్ట్ లో గోపాల్ గంజ్ లోని ఖర్జుర్ బని ప్రాంతంలో జ‌రిగిన నాటుసారా విషాద ఘ‌ట‌న‌లో 21 మంది మ‌ర‌ణించారు. చాలామంది అనారోగ్యానికి గురయ్యారు. ఇద్దరు వ్యక్తులు కంటిచూపును కూడా కోల్పోయారు. ఈ కేసుపై అప్పటినుంచి కోర్టులో వాదనలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఫిబ్ర‌వ‌రి 26వ తేదీ ఇచ్చిన తీర్పులో 13 మందిని దోషులుగా తేల్చుతూ కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ కేసులో మ‌ర‌ణ‌శిక్ష ప‌డిన 9 మంది ఒకే కుటుంబానికి చెందిన‌వారు కావ‌డం విశేషం.

    2016 ఆగ‌స్టులో గోపాల్‌గంజ్ జిల్లాలోని ఖ‌ర్జుర్‌బానీ ప్రాంతంలో నాటు సారా తాగిన ఘ‌ట‌న‌లో 21 మంది ప్రాణాలుకోల్పోగా.. కొందరు కంటి చూపు కోల్పోయారు. ఇదే కేసులో అప్పుడు పోలీసుల‌పై కూడా చ‌ర్య‌లు తీసుకున్నారు. 21 మంది పోలీసులను విధుల నుంచి తొలగించారు. వారిలో ముగ్గురు స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్లు కూడా ఉన్నారు. ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించరంటూ పోలీసు అధికారుల్ని సస్పెండ్ చేశారు.
    Published by:Sridhar Reddy
    First published:

    అగ్ర కథనాలు