Home /News /crime /

కాల్పులకు దారితీసిన భూవివాదం.. 9 మంది మృతి..

కాల్పులకు దారితీసిన భూవివాదం.. 9 మంది మృతి..

గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం

గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం

వివాదంలో ఉన్న ఓ భూమిని దున్నడానికి సర్పంచ్ ప్రయత్నించడంతో..దాన్ని వ్యతిరేకిస్తున్న గ్రామస్తులు అక్కడికి చేరుకుని వారితో వాగ్వాదానికి దిగారు. ఇంతలో సర్పంచ్ వర్గం నుంచి ఒకరు కాల్పులు జరపడంతో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు.

ఇంకా చదవండి ...
  ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లా ఘోరవల్ గ్రామంలో చెలరేగిన ఓ భూవివాదం తీవ్ర ఘర్షణకు దారితీసి 9 మంది మృతి చెందారు. ఇందులో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. ఘటనలో మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు బాధ్యులుగా భావిస్తున్న గ్రామ సర్పంచ్‌ అల్లుళ్లు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

  వివాదంలో ఉన్న ఓ భూమిని దున్నడానికి సర్పంచ్ ప్రయత్నించడంతో..దాన్ని వ్యతిరేకిస్తున్న గ్రామస్తులు అక్కడికి చేరుకుని వారితో వాగ్వాదానికి దిగారు. ఇంతలో సర్పంచ్ వర్గం నుంచి ఒకరు కాల్పులు జరపడంతో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. 19 మంది గాయపడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే స్థానిక ఎస్పీ,సబ్-డివిజనల్ మెజిస్ట్రేట్ అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఘటనపై ఉత్తరప్రదేశ్ డీజీపీ ఓపీ సింగ్ 'న్యూస్18'తో మాట్లాడారు. గ్రామ సర్పంచ్ గతంలో ఒక ఐఏఎస్ అధికారి నుంచి కొంత వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడని చెప్పారు. ఆ భూమిని దున్నేందుకు సర్పంచ్ వెళ్లగా.. కొంతమంది గ్రామస్తులు అడ్డుకున్నారని తెలిపారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగి కాల్పులకు దారితీసిందన్నారు. కాల్పుల్లో 9 మంది చనిపోయారని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్టు వెల్లడించారు.
  First published:

  Tags: Land dispute, Uttar pradesh, Yogi adityanath

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు