Passenger bus falls off bridge: నేపాల్(Nepal)లో ప్రమాదవశాత్తు బస్సు నదిలో పడిపోయింది. దీంతో తొమ్మిది మంది మృతి చెందగా,మరో 23 గాయపడ్డారు. చనిపోయినవారిలో ఓ మహిళ,ఎనిమిది మంది పురుషులు ఉన్నారు. ఆదివారం రూపందేహి జిల్లాలో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 33మంది ప్రయాణికులు ఉన్నారు. ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో జనక్‌పూర్ నుంచి భైరవన్ వైపు వస్తున్న Lu 2 Kha 3841 బస్సు భైరహవాన్ -పరాసి రహదారిపై బసంతపూర్ వద్ద రోహిణి నదిపై ఉన్న బ్రిడ్జిపై పై నుంచి నదిలో పడిపోయింది. రోహిణి వంతెన రెయిలింగ్ విరిగి నదిలో పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బయటకు తీసి ట్రీట్మెంట్ నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు.
రూపాందేహి డిప్యూటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నవరత్న పౌడెల్ తెలిపిన వివరాల ప్రకార..., తీవ్రంగా గాయపడిన వారిలో ఐదుగురు భైరహవాలోని యూనివర్సల్ మెడికల్ కాలేజీలో మరియు మరో నలుగురు భైరహవా భీమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గాయపడిన వారిలో 16 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇతరుల పరిస్థితి సాధారణంగా ఉన్నట్లు చెప్పారు. గాయపడిన వారు భైరహవాలోని మెడికల్ కాలేజీ, భీమ్ హాస్పిటల్ మరియు సిద్ధార్థ సిటీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారన్నారు. మృతులను ఇంకా గుర్తించలేదని చెప్పారు. మృతులను గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు.
ALSO READ Imran Khan : ఇమ్రాన్ ఖాన్ హత్యకు కుట్ర..పాక్ లో హై అలర్ట్!
మరోవైపు,భారత్ పొరుగుదేశం బంగ్లాదేశ్ లో భయానక ప్రమాదం చోటుచేసుకుంది. సీతాకుందా పోర్టులోని కెమికల్ డిపోలో భారీ పేలుడు వల్ల కనీసం 42 మంది అగ్నికి ఆహుతైపోగా, మరో 300మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులకు చిట్టగాంగ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ సహా సమీపంలోని ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. శనివారం రాత్రి 9 గంటలకు అంటుకున్న ఈ మంటలు అర్ధరాత్రి సమయానికి పెద్ద ఎత్తున అలుముకుని పేలుడు సంభవించిందని.. ఆ పేలుడు తర్వాత మంటలు ఆ ప్రాంతమంతా వ్యాపించాయని అధికారులు పేర్కొన్నారు.వైద్యఆరోగ్య శాఖ అధికారి ఇస్లాం మాట్లాడుతూ.. 450 మందికి పైగా ఈ ఘటనలో గాయపడ్డారని, మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని చెప్పారు. ఆదివారం మధ్యాహ్నం నాటికి మరణాల సంఖ్య 42గా నిర్ధారణ కాగా, ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. భారీ ప్రమాదం జరిగిన కంటైనర్ డిపోను మే 2011 నుంచి ఆపరేట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఘటన జరిగిన సీతాకుందా ప్రాంతం చిట్టగాంగ్ నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఘటనపై ప్రధాని హసీనా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bus accident, Nepal