Car washed away in river : ఉత్తరాఖండ్(Uttarakhand)రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున నైనిటాల్(Ninital) జిల్లా రామ్‌నగర్ ప్రాంతంలో వరద ఉధృతికి ధేలా నదిలో ఓ కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 9మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో కారులో 11 మంది ఉన్నారని..ఇద్దరిని పోలీసులు రక్షించినట్లు అధికారులు తెలిపారు. తెల్లవారుజామున 5 గంటలకు ఈ ఘటన జరిగిందని కుమావోన్ రేంజ్ డిఐజి ఆనంద్ భరన్ తెలిపారు. భారీ వర్షాల కారణంగా నైనిటాల్ నుంచి రాంనగర్ దారిలోని వంతెనపై వరద ఉధృతంగా ప్రవహిస్తుందని చెప్పారు. మృతులందరూ పంజాబ్ కు చెందిన టూరిస్ట్ లుగా గుర్తించామన్నారు. ఇప్పటివరకు నలుగురు మృతదేహాలను వెలికితీయగా, ఐదుగురు ఇంకా కారులో చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు.
స్థానిక ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం... ధేలా నది ప్రాంతంలో రాత్రి 2 గంటల నుండి భారీ వర్షం కురుస్తోంది, దీని కారణంగా నది కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నది ఉధృతి గురించి తెలియజేసేందుకు చేతితో సైగ చేసి కారును కూడా ఆపేందుకు ప్రయత్నించామని.. అయితే కారు ఆగకపోవడంతో నీటిలో కొట్టుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.
మరోవైపు,బైక్ (Bike)వేగంగా వెళుతున్న సమయంలో ఇవి టైర్లలో చిక్కుకుంటే ఆ తరువాత జరిగే ప్రమాదాలు ఊహకు అందని విధంగా ఉంటాయి. తాజాగా రాజస్థాన్‌లో(Rajasthan) ఇలాంటి ఓ ప్రమాదమే జరిగింది. రాజస్థాన్‌లోని కిషన్‌గఢ్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని జైపూర్ హైవే నసీరాబాద్ పులియా సమీపంలో ఒక ప్రమాదం జరిగింది. బందరుసింద్రీ గ్రామంలో తమ బంధువు వివాహ వేడుకకు(Marriage Event) దంపతులు బైక్‌పై వెళ్లారు. ఈలోగా నసీరాబాద్ కల్వర్టు సమీపంలో బైక్‌పై కూర్చున్న మహిళ దుపట్టా బైక్ టైరులో ఇరుక్కుపోవడంతో మహిళ మెడకు ఉచ్చు తగిలి రోడ్డుపై పడింది. ఈ ప్రమాదంలో మహిళ తలకు బలమైన గాయం కావడంతో జివికె అంబులెన్స్ సిబ్బంది రాష్ట్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు. మృతురాలి మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి మార్చురీలో ఉంచిన వెంటనే నగర పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రేపు ఉదయం మహిళ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించనున్నారు. నగర పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సమాచారం ప్రకారం.. రాజారెడ్డిలో నివాసముంటున్న శివరాజ్ మేఘ్వాల్, అతని భార్య మన్వర్ దేవి, అతని ఇద్దరు పిల్లలు బందర్‌సింద్రీ గ్రామంలో జరిగే వివాహ వేడుకకు హాజరయ్యేందుకు బైక్‌పై వెళ్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Car accident, Uttarakhand