పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పక్కనే ఉండే నిమ్స్ ఆస్పత్రిలో జరిగిందీ ఘటన. ఫలక్నుమాకి చెందిన 18 ఏళ్ల యువతి అస్మా బేగం రెండు నెలలుగా వెన్ను నొప్పితో బాధపడుతోంది. రెగ్యులర్‌గా నిమ్స్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటోంది. నొప్పి ఎంతకీ తగ్గకపోవడంతో... ఎక్స్‌రే తీశారు. షాక్ అయ్యారు. ఆమె శరీరంలో ఓ బుల్లెట్ ఉన్నట్లు గుర్తించారు. అసలా బుల్లెట్ బాడీలోకి ఎలా వచ్చింది అని యువతిని అడిగితే... ఆమె ఏమీ చెప్పకుండా... తనకు తెలీదని చెబుతుండటం మరో షాకింగ్ విషయం. తాము అడిగితే చెప్పట్లేదు కాబట్టి... లాభం లేదనుకున్న డాక్టర్లు... పక్కనే ఉండే పంజాగుట్ట పోలీసులకు విషయం చెప్పారు. పోలీసులు కంప్లైంట్ రాశారు. ఆ యువతి డిసెంబర్ 22న డిశ్చార్జి అయ్యిందని డాక్టర్లు తెలిపారు. యువతి అడ్రెస్‌ను పోలీసులకు ఇచ్చారు. ఇప్పుడు పోలీసులు యువతి ఇంటికి వెళ్లి దర్యాప్తు చెయ్యనున్నారు. ఏ చెవిలోనో పురుగు దూరితే... అది ఎలా వచ్చిందో మనకు తెలియకపోవచ్చు. కానీ... వెన్నులోకి బుల్లెట్ దిగితే తెలియకుండా ఉంటుందా? ఆ యువతి ఏదో సీక్రెట్ దాస్తోందని పోలీసులు భావిస్తున్నారు. రేపో, ఎల్లుండో నిజం బయటపడటం ఖాయం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Breaking news, India news, National News, News online, News today, News updates, Telangana News, Telangana updates, Telugu news, Telugu varthalu