ఫేస్‌బుక్ గర్ల్‌ఫ్రెండ్‌ను కలిసేందుకు లాడ్జికి వెళ్లిన యువకుడికి...అనుకోని షాక్...?

రెండు నెలల క్రితం ఒక అందమైన అమ్మాయి ప్రొఫైల్ ఫోటో ఉన్న ఫేస్ బుక్ అకౌంట్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ రాగా, మోహిత్ అమ్మాయి మోజులో వెంటనే రిక్వెస్ట్ ఓకే చేసి, అపరిచిత వ్యక్తితో చాటింగ్ చేయడం ప్రారంభించాడు.

news18-telugu
Updated: October 15, 2019, 5:59 PM IST
ఫేస్‌బుక్ గర్ల్‌ఫ్రెండ్‌ను కలిసేందుకు లాడ్జికి వెళ్లిన యువకుడికి...అనుకోని షాక్...?
నమూనా చిత్రం
  • Share this:
సైబర్ నేరగాళ్ల ఆటలకు అమాయకులు బలవుతున్న ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా కోల్ కతాలో ఓ యువకుడు ఫేస్‌బుక్ లో పరిచయమైన యువతి మోజులో పడి కిడ్నాపైన ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే బాధితుడు మోహిత్ సేన్ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అప్ డేట్స్ చేయడం, అపరిచితులతో చాటింగ్ చేస్తుండేవాడు. అయితే ఈ క్రమంలో రెండు నెలల క్రితం ఒక అందమైన అమ్మాయి ప్రొఫైల్ ఫోటో ఉన్న ఫేస్ బుక్ అకౌంట్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ రాగా, మోహిత్ అమ్మాయి మోజులో వెంటనే రిక్వెస్ట్ ఓకే చేసి, అపరిచిత వ్యక్తితో చాటింగ్ చేయడం ప్రారంభించాడు. అయితే కొంతకాలం గడిచిన తర్వాత అపరిచిత వ్యక్తి ఆహ్వానం మేరకు కోల్‌కతాలోని ఓ లాడ్జికి మోహిత్ వెళ్లాడు. ఎన్నో కలలతో లాడ్జీ గది తలుపు తెరవగానే, లోపల సీన్ చూసిన మోహిత్ బిత్తరపోయాడు. గదిలోపల ధృఢకాయులైన నైజీరియన్లు నలుగురిని చూసి భయపడిపోయాడు. తాను మోసపోయానని గ్రహించేలోపే నైజీరియన్లు మోహిత్ ను బంధించారు. వెంటనే అతడి ఫోన్ తీసుకొని అతడి ఇంటి సభ్యులకు ఫోన్ చేసి కిడ్నాప్ చేశామని, భారీ మొత్తంలో డబ్బు ఇస్తేనే వదిలిపెడతామని బెదిరించారు.

అయితే మోహిత్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కాల్ ట్రేస్ చేయడం ద్వారా నైజీరియన్లు అడ్డాను కనుగొని, వారి చెర నుంచి మోహిత్ ను విడిపించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
Published by: Krishna Adithya
First published: October 15, 2019, 5:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading