Cocaine in stomach: వామ్మో.. కడుపులో రూ.11 కోట్ల కొకైన్.. వీడొక్కడే సినిమాను దించేశారు..

నైజీరియన్ కడుపులో సీజ్ చేసిన డ్రగ్స్ ఇవే

వీడొక్కడే సినిమాలో తమన్నా సోదరుడు డ్రగ్స్ ముఠాతో చేతులు కలిపి.. డ్రగ్స్ క్యాప్సుల్స్‌ను మింగి, వాటిని కడుపులో దాచుకొని.. మలేషియాకు తరలించే సీన్.. సినిమాకే హైలైట్. ఐతే అచ్చం అలాంటి ఘటనే బెంగళూరు ఎయిర్‌పోర్టులో జరిగింది.

 • Share this:
  మన దేశంలో డ్రగ్స్ స్మగ్లింగ్ జోరుగా సాగుతోంది. అధికారులు ఉక్కుపాదం మోపుతున్నా.. కఠిన చర్యలు తీసుకుంటున్నా.. డ్రగ్స్‌కు అడ్డకట్ట పడడం లేదు. అక్రమార్కులు రోజుకో మార్గంలో మాదకద్రవ్యాలను తరలిస్తున్నారు. అధికారులకు చిక్కకుండా ఉండేందుకు కొత్త కొత్త టెక్నిక్స్ ఫాలో అవుతున్నారు. కొందరు ఎలక్ట్రానిక్ పరికరాల్లో.. మరికొందరు విగ్రహాల్లో డ్రగ్స్‌ని కలిపేసి.. ఎవరికీ అనుమానం రాకుండా దేశం దాటించేస్తున్నారు. ఇంకొందరు కేటుగాళ్లు మత్స్యకారుల పడవల మాటున తరలిస్తున్నారు. మరికొందరైతే ప్రాణాలను రిస్క్ చేసి.. కడుపులో దాచుకొని.. విమానాల ద్వారా అక్రమ రవాణా చేస్తున్నారు. అచ్చం వీడొక్కడే సినిమాల్లో చూపించినట్లుగా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారు. సూర్య, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన వీడొక్కడే సినిమాలో మాదక ద్రవ్యాల అక్రమ రావాణా ఎలా జరుగుతుందో.. కళ్లకు కట్టినట్లు చూపించారు.

  తమన్నా సోదరుడు డ్రగ్స్ ముఠాతో చేతులు కలిపి.. డ్రగ్స్ క్యాప్సుల్స్‌ను మింగి, వాటిని కడుపులో దాచుకొని.. మలేషియాకు తరలించే సీన్.. సినిమాకే హైలైట్. ఐతే అచ్చం అలాంటి ఘటనే బెంగళూరు ఎయిర్‌పోర్టులో తాజాగా చోటుచేసుకుంది.

  కడుపులో డ్రగ్స్ క్యాప్సుల్స్ దాచుకొని ఇండియాకు తరలించిన ఓ నైజీరియన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు అరెస్ట్ చేశారు. ఏకంగా 1.25 కేజీల కొకైన్‌ను కడుపులో దాచుకున్నాడు. దాని విలువ ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా.. రూ.11 కోట్లు. దుబాయ్‌ నుంచి బెంగళూరులోని కెంపె గౌడ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టుకు ఓ విమానం వచ్చింది. ఐతే ఆఫ్రికాకు చెందిన ఆ వ్యక్తి విమానంలో ఆహారం, నీరు తీసుకోకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చింది. వెంటనే డీఆర్ఐ అధికారులకు సమాచారం వచ్చింది. ఎయిర్‌పోర్టులో దిగగానే అతడితో పాటు లేగేజీని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. కానీ ఏమీ దొరకలేదు.

  అయినా అధికారులకు మాత్రం అనుమానం తొలగలేదు. ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయాలని భావించారు. కానీ అందుకు ఒప్పుకోలేదు. నన్నే ఎందుకు చెక్ చేస్తున్నారని నిలదీశాడు. కానీ కడుపులో ఇబ్బందిగా ఉండడంతో.. ఆస్పత్రికి తీసుకెళ్లాలని చివరకు అతడే పోలీసులను కోరాడు. ఓ ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో స్కానింగ్ చేయగా.. కడుపులో క్యాప్సుల్స్ ఉన్నట్లు గుర్తించారు. అనంతరం వాటిని బయటకు తీసి చూస్తే ఏకంగా 1.25 కేజీల బరువు ఉన్నాయి. ఈ కేసులో నైజీరియన్‌ను డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఐతే వాటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? బెంగళూరులో ఎవరికి ఇవ్వాలి? ఆ డ్రగ్స్‌ను రిసీవ్ చేసుకునేందుకు వచ్చే వివరాలను మాత్రం నిందితుడు వెల్లడించలేదు. ఈ కేసును డీఆర్ఐ అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. లోతుగా దర్యాప్తు చేసి.. దీని వెనక ఎవరెవరు ఉన్నారన్న వివరాలను కూపీ లాగుతున్నారు.

  ఇవి కూడా చదవండి:

  స్నేహితులకు రూ. 40 లక్షలు అప్పు ఇచ్చాడు.. తిరిగి ఇవ్వమని అడిగినందుకు దారుణంగా చంపేశారు
  Published by:Shiva Kumar Addula
  First published: