కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభం..

Kerala gold smuggling case updates: కాన్సులేట్‌కు సంబంధించిన పార్శిల్లో భారీగా బంగారం పట్టుబడటం కేరళలో కలకలం సృష్టించింది.

news18-telugu
Updated: July 10, 2020, 4:09 PM IST
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కేరళలో ప్రకంపనలు సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు మొదలుపెట్టింది. ఈ విషయాన్ని ఎన్ఐఏ కేరళ హైకోర్టుకు తెలిపింది. ప్రధాన నిందితురాలు స్వప్న సురేశ్, మరికొందరి పేర్లను కేసులో చేర్చిన ఎన్ఐఏ అధికారులు...వారి ప్రమేయంపై దర్యాప్తు ప్రారంభించారు. తిరువనంతపురంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) కాన్సులేట్‌కు చెందిన పార్శిల్లో రూ.15 కోట్ల విలువైన 30 కిలోల బంగారాన్ని జులై 4న విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాన్సులేట్‌కు సంబంధించిన పార్శిల్లో భారీగా బంగారం పట్టుబడటం కేరళలో కలకలం సృష్టించింది.

ఓ దేశ దౌత్య కార్యాలయానికి సంబంధించిన పార్శిల్లో ఇంత మొత్తంలో బంగారం అక్రమంగా రవాణా చేస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడటం దేశంలో ఇదే తొలిసారి. ఈ వ్యవహారంలో యూఏఈ కాన్సులేట్ ఉద్యోగితో పాటు కేరళ ప్రభుత్వ ఐటీ శాఖలో పనిచేస్తున్న స్వప్న సురేశ్.. కేరళ సీఎం కార్యాలయ ప్రధాన కార్యదర్శి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు రాజకీయ దుమారం రేపడంతో పినరయి విజయన్ సర్కారుకు ఇబ్బందికరంగా మారింది. దీంతో స్వప్న సురేశ్‌ను విధుల్లోకి తీసుకున్నందుకు సీఎం ప్రధాన కార్యదర్శి శివ శంకర్‌పై ఇప్పటికే సస్పెన్షన్ వేటు వేశారు. ఈ వ్యవహారంపై ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ సిఫార్సు మేరకు ఎన్ఐఏ విచారణ మొదలుపెట్టింది.

Published by: Kishore Akkaladevi
First published: July 10, 2020, 4:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading