రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం ఉదయం నుంచి ఎన్ఐఏ అధికార బృందాలు విస్తృతంగా సోదాలు జరుపుతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని నెల్లూరు జిల్లాలో కూడా సోదాలు జరుగుతున్నాయి. బుచ్చిరెడ్డిపాలెంలోని ఖాజా నగర్ లో NIA సిబ్బంది సోదాలు నిర్వహించారు. ఇలియాజ్ అనే వ్యక్తి ఇంట్లో అధికారులు సోదాలు చేపట్టారు. ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్నట్లు ఆరోణలు రావడంతో ఎన్ఐఏ అధికారులు బుచ్చిరెడ్డిపాలెం వచ్చారు. మూడు నెలలుగా ఇలియాజ్ కిపించకుండా పోయాడని అధికారులు నిర్థారించారు. గతంలో ఖాజా నగర్ లో టిఫిన్ సెంటర్ నిర్వహించే ఇలియాజ్ మూడు నెలలుగా కనపడటంలేదు. ఇలియాజ్ కుటుంబ సభ్యులను ఎన్ఐఏ సిబ్బంది విచారించారు. పలు కీలక పత్రాలు, ఫోన్ నెంబర్లు సేకరించినట్టు తెలుస్తోంది. తిరిగి వస్తుండగా స్థానికులు వారిని అడ్డుకున్నారు. లోపల ఏం జరిగిందో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఎన్ఐఏ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. చివరకు స్థానిక పోలీసులు వచ్చి వారికి సర్దిచెప్పారు.
కరీంనగర్ జిల్లాలోనూ..
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కరీంనగర్ లోనూ సోదాలు నిర్వహించింది . ఆదివారం తెల్లవారుజామున కరీంనగర్‌లోని హుస్సేనిపురాలో దాడులు చేసి ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్ నుండి వచ్చిన ప్రత్యేక బృందం కరీంనగర్ లో సోదాలు నిర్వహించడం కలకలకం సృష్టించింది . జగిత్యాలకు చెందిన మహ్మద్ ఇర్ఫాన్ సమీప బంధువుల ఇంట్లో షెల్టర్ తీసుకున్న సమాచారం అందుకున్న టీం సోదాలు నిర్వహించి అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం ఉంది. ఇర్ఫాన్ ను విచారణ కోసం హైదరాబాద్ తరలించినట్టు తెలుస్తోంది.
జగిత్యాలలో జిల్లాలో ఎన్‌ఐఏ సోదాలు..
ఆదివారం తెల్లవారుజాము నుండి ఎన్‌ఐఏ అధికారులు జగిత్యాలలో పాపులర్ ఫ్రాంట్ ఆఫ్ ఇండియా నాయకుల ఇండ్ల పై, షాపులపై దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో ఒకరి నివాసంలో డైరీతో పాటు కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం అందుతోంది.
తెలంగాణలో పలుచోట్ల..
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికార బృందాలు నిజామాబాద్ జిల్లాలో వాలిపోయాయి. జిల్లాలో సీక్రెట్‌గా అడుగుపెట్టిన అధికారులు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు పలువుర్ని టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే సోదాలు చేపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇద్దరు ప్రజాప్రతినిధుల ఆర్థిక అంశాలపై ప్రత్యే కంగా నిఘా పెట్టినట్టు తెలిసింది. జీఎస్టీ విభాగానికి చెందిన సుమారు 20 మంది అధికారులను కూడా ఎస్ఐఏ ఆఫీసర్లు వెంట తీసుకెళ్లారని సమాచారం ఉంది. శనివారం దాడుల్ని ప్రారంభించిన ఎన్‌ఐఏ అధికారులు విషయాన్ని ఏమాత్రం బయటకు పొక్కకుండా వ్యవహరిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, NIA, Telangana News