• HOME
 • »
 • NEWS
 • »
 • CRIME
 • »
 • NIA ARRESTS JAISH TERRORIST FOR ATTACK ON LETHPORA CRPF CAMP MS

ఆ దాడితో సంబంధం ఉన్న జైషే ఉగ్రవాదిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

ఆ దాడితో సంబంధం ఉన్న జైషే ఉగ్రవాదిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

ప్రతీకాత్మక చిత్రం

NIA arrests Jaish terrorist : సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌పై దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు ఇర్షాద్ అహ్మద్ రేషి ఆశ్రయం కల్పించాడని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. అంతేకాదు, ఉగ్రదాడికి ముందు ఇర్షాద్ స్వయంగా రెక్కీ నిర్వహించాడని తెలిసింది.

 • Share this:
  జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఆదివారం(ఏప్రిల్ 14) ఓ జైషే మహమ్మద్ ఉగ్రవాదిని అరెస్ట్ చేసింది. ఏప్రిల్ 15 లోపు జమ్మూలోని ఎన్ఐఏ కోర్టు ముందు అతన్ని ప్రవేశపెట్టనుంది. డిసెంబర్ 30, 2017లో దక్షిణ కశ్మీర్‌ లెథ్‌పొరాలోని సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌పై జరిగిన ఉగ్రదాడితో ఇతనికి సంబంధాలు ఉన్నట్టు ఎన్ఐఏ గుర్తించింది. అప్పటి ఉగ్రదాడిలో ఐదు మంది భారత జవాన్లను ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. ఆ దాడిలో ఐదో నిందితుడిగా ఉన్న ఇతన్ని ఇర్షాద్ అహ్మద్ రేషిగా ఎన్ఐఏ గుర్తించింది. గతంలో హత్య గావించబడ్డ జైషే మహమ్మద్ కమాండర్ నూర్ మహమ్మద్‌కు ఇర్షాద్ అత్యంత సన్నిహితుడు అని సమాచారం.

  కాగా, సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌పై దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు ఇర్షాద్ అహ్మద్ రేషి ఆశ్రయం కల్పించాడని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. అంతేకాదు, ఉగ్రదాడికి ముందు ఇర్షాద్ స్వయంగా రెక్కీ నిర్వహించాడని తెలిసింది. ఇదే కేసులో మరో నలుగురు నిందితులు ఫయాజ్ అహ్మద్ మాగ్రే, మంజూర్ అహ్మద్ భట్, నిసార్ అహ్మద్ తాంత్రాయ్, సయ్యద్ హిలాల్ అంద్రాబిలను ఎన్ఐఏ ఇప్పటికే అరెస్ట్ చేసింది.  First published: