ఆ పని చేస్తూ మధ్యలో కండోమ్ తీశాడు.. ఆ తర్వాత ఆ యువతి చేసిన పని తెలిస్తే మైండ్ బ్లాకే..

ప్రతీకాత్మక చిత్రం

మహిళతో పడకగదిలో ఏకాంతంగా గడిపాడు. ఇద్దరూ రొమాన్సులో మునిగితేలారు. అయితే, మధ్యలో ఆమెకు తెలియకుండా కండోమ్ తీసేసి ఆ పని కొనసాగించాడు. ఈ విషయం తెలిసి ఆ మహిళ షాకైంది.

 • Share this:
  ఇటీవలి కాలంలో కండోమ్‌ల వాడకం ఎక్కువయింది. అవాంఛిత గర్భాన్ని నిరోధించేందుకు ఎన్నో పద్దతులు ఉన్నప్పటికీ.. ఎక్కువ మంది మాత్రం కండోమ్‌లను ఉపయోగిస్తారు. ఇతర మార్గాల్లో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే జంటలు వీటికే ప్రాధాన్యత ఇస్తాయి. సాధారణంగా గర్భం రాకుండా ఉండేందుకు, సురక్షిత శృంగారం కోసం కండో‌మ్ వాడతారు. అయితే, ఈ ఘటనలో ఆ వ్యక్తి హద్దు మీరాడు. మహిళతో పడకగదిలో ఏకాంతంగా గడిపాడు. ఇద్దరూ రొమాన్సులో మునిగితేలారు. అయితే, మధ్యలో ఆమెకు తెలియకుండా కండోమ్ తీసేసి ఆ పని కొనసాగించాడు. ఈ విషయం తెలిసి ఆ మహిళ షాకైంది. అంతేకాదు.. అతడిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. దీంతో పోలీసులు అతడిపై రేప్ కేసు నమోదు చేశారు. ఈ ఘటన న్యూజిలాండ్‌లో చోటుచేసుకుంది. అయితే శృంగారం జరిగేటప్పుడు కండోమ్ ధరించకుండా తమ భాగస్వామిని మోసం చేస్తే అది తీవ్ర దుష్పప్రభావాలకు దారి తీయవచ్చు. శృంగారంలో పాల్గొనే మహిళ గర్భం దాల్చే అవకాశం ఉంటుంది. అలాగే లైంగిక సంక్రమణ వ్యాధులకు కూడా దారితీస్తుంది. వాస్తవానికి ఒక జంట పరస్పర అంగీకరంతో రొమాన్స్ చేస్తే తప్పులేదు. అయితే, ఆ సమయంలో మహిళ అనుమతి లేకుండా మధ్యలో కండోమ్ తొలగించి ఆ పని చేస్తే మాత్రం నేరమే. న్యూజిలాండ్‌లో ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తారు. అందుకే, ఆ మహిళ ఫిర్యాదు అందుకోగానే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని రేప్ కేసు పెట్టారు. ఆమె అంగీకరం లేకుండా బలత్కారం చేయడం ఎంత నేరమో.. ఆమె అంగీకరం లేకుండా కండోమ్ తొలగించడం అత్యాచారంతో సమానమని అక్కడి చట్టాలు చెబుతున్నాయి.

  ఇది వరకు ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకొనేవారు కాదు. అయితే, హెచ్‌ఐవీ ఎయిడ్స్, లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్ల తీవ్రత ఎక్కువగా ఉండటంతో కొన్ని దేశాల్లో ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ముఖ్యంగా అపరిచిత మహిళలతో ఆ పనిలో పాల్గొనే పురుషులు తప్పకుండా కండోమ్ వినియోగించాలి. ఆ మహిళకు ఎలాంటి అభ్యంతరం లేకపోతేనే కండోమ్ తొలగించి పనిలో పాల్గోవాలి. మధ్యలో దాన్ని తీసేసి మోసం చేస్తే అత్యాచారం కిందే పరిగణిస్తామనిన్యూజిలాండ్ అధికారులు చెబుతున్నారు.

  ప్రస్తుతం ఇది ఒక సమస్యగా మారిందని అక్కడి నాయకులు అంటున్నారు. అయితే సీక్రెట్ నేచర్ కారణంగా ఇది గుర్తించబడదని వారు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అవగాహన కల్పించేందుకు అనేక బ్లాగులు ఉన్నాయని చెప్పారు. ఇలా చేయడం ద్వారా ఒకరకంగా శారీరక వేధింపులకు పాల్పడటమేని నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ రోజుల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నట్లు అక్కడి సర్వేలో వెల్లడైంది.
  Published by:Sridhar Reddy
  First published: