సినీ ఫక్కీలో వీధుల్లో తరుముతూ రిపోర్టర్ పై కత్తులతో దాడి..

న్యూస్ 18 అస్సాం నార్త్ ఈస్ట్ ఛానెల్‌లో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టు చక్రపాణి పరాశర్ పై దుండగులు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అస్సాం రాజధాని గువహటిలో గణేశ్ గురి ప్రాంతంలోని అల్బర్ ఈట్స్ అనే రెస్టారెంట్లో ఘర్షణ చోటు చేసుకోగా, జర్నలిస్టుపై సదరు రెస్టారెంట్ ఓనర్ అలాగే అక్కడి సిబ్బంది కత్తులతో దాడిచేశారు

news18-telugu
Updated: March 22, 2019, 5:32 PM IST
సినీ ఫక్కీలో వీధుల్లో తరుముతూ రిపోర్టర్ పై కత్తులతో దాడి..
జర్నలిస్టుపై దాడి దృశ్యం
news18-telugu
Updated: March 22, 2019, 5:32 PM IST
న్యూస్ 18 అస్సాం నార్త్ ఈస్ట్ ఛానెల్‌లో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టు చక్రపాణి పరాశర్ పై దుండగులు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అస్సాం రాజధాని గువహటిలో గణేశ్ గురి ప్రాంతంలోని అల్బర్ ఈట్స్ అనే రెస్టారెంట్లో ఘర్షణ చోటు చేసుకోగా, జర్నలిస్టుపై సదరు రెస్టారెంట్ ఓనర్ అలాగే అక్కడి సిబ్బంది కత్తులతో దాడిచేశారు. పరిస్థితి గమనించిన స్థానికులు జర్నలిస్టు చక్రపాణిని హుటాహుటిన స్థానిక సిటీ ఆసుపత్రికి తరలించగా వైద్య చికిత్స అందిస్తున్నారు. స్థానికుల సమాచారం ప్రకారం రెస్టారెంట్‌లో ఇటీవల చోటు చేసుకున్న హత్యాయత్నం నేరానికి సంబంధించిన కవరేజీ కోసం జర్నలిస్టు చక్రపాణి వెళ్లగా, అక్కడి సిబ్బంది ఆందోళనకు గురై ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో రిపోర్టర్ చక్రపాణిని గురువారం రాత్రి9గంటల సమయంలో రెస్టారెంట్ సిబ్బంది కత్తులతో దాడికి దిగి తీవ్రంగా గాయపరిచారు. సినీ ఫక్కీలో వీధుల్లో తరుముతూ మరీ రిపోర్టర్‌ను వెంటాడి కత్తితో దాడి చేశారు. అయితే సంఘటన మొత్తం సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యింది. సీసీటీవీ ఫుటేజీలో రిపోర్టర్ చక్రపాణి పొట్టలోనూ, తొడ భాగంలో దుండగులు కత్తితో పొడిచినట్లు రికార్డయ్యింది.దాడి అనంతరం కూడా రెస్టారెంట్ సిబ్బంది వీధిలోకి వచ్చి గొడవలు చేసేందుకు ప్రయత్నించారు. వీధిలోకి ఎల్పీజీ సిలిండర్ ను పేల్చేందుకు ప్రయత్నం చేయగా, స్థానికులు అడ్డుకున్నారు. అనంతరం పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని పరిస్ధితిని చక్కదిద్దారు. దుండగులపై కేసు నమోదుచేశారు. కాగా రెస్టారెంట్ ఓనర్ సయెద్ అలీపై గతంలో కూడా నేరారోపణలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే రిపోర్టర్ చక్రపాణిపై జరగిన దాడిని అస్సాంలోని జర్నలిస్టు సంఘాలు ముక్త కంఠంతో ఖండించాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి.

First published: March 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...