పెళ్లికి నిరాకరించిన ప్రియుడు.. న్యూస్ ఛానెల్ ఉద్యోగి ఎంత పనిచేసిందంటే..

ఇటీవల కళ్యాణి తనను పెళ్లి చేసుకోవాలని శివను కోరింది. దీంతో అతడి పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. తన ప్రేమ విఫలం అయినందుకు తీవ్ర మానసిక వేదనకు గురయ్యింది.

news18-telugu
Updated: July 15, 2020, 3:05 PM IST
పెళ్లికి నిరాకరించిన ప్రియుడు.. న్యూస్ ఛానెల్ ఉద్యోగి ఎంత పనిచేసిందంటే..
ఆత్మహత్య చేసుకున్న యువతి కల్యాణి
  • Share this:
వారిద్దరూ ఓ న్యూస్ ఛానల్‌లో పనిచేస్తున్నారు. తోటి ఉద్యోగులు కావడంతో వారికి తొందరగా పరిచయం అయ్యింది. కొద్దిరోజుల్లోనే ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఒకరినొకరు చట్టాపట్టాలేసుకుని తిరిగారు. తీరా ప్రియురాలు పెళ్లి చేసుకోవాలని అడగడంతో ప్రియుడు మొహం చాటేశాడు. దీంతో మనస్తాపం చెందిన ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని గాంధీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సిద్ధిపేటకు చెందిన కల్యాణి(26) అనే యువతి హైదరాబాద్‌లోని ఓ న్యూస్ ఛానల్‌లో ఉద్యోగం చేస్తోంది. అదే ఛానల్‌లో పనిచేస్తున్న శివ అనే యువకుడితో ప్రేమలో పడింది. రెండు సంవత్సరాలుగా వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఇటీవల కళ్యాణి తనను పెళ్లి చేసుకోవాలని శివను కోరింది. దీంతో అతడి పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. తన ప్రేమ విఫలం అయినందుకు తీవ్ర మానసిక వేదనకు గురయ్యింది.

ఇక తాను బతకడం వృథా అని భావించిన యువతి ఎవరూ లేని సమయంలో ఇంటిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు. ఇదిలావుంటే.. కళ్యాణి తండ్రి రాములు తన కూతురు మృతికి శివ కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
Published by: Narsimha Badhini
First published: July 15, 2020, 1:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading