హోమ్ /వార్తలు /క్రైమ్ /

పెళ్లై నెల కూడా కాలేదు.. మరిదిపై మనసు పారేసుకున్న వదిన.. భర్తను కాదని అతడితో జంప్

పెళ్లై నెల కూడా కాలేదు.. మరిదిపై మనసు పారేసుకున్న వదిన.. భర్తను కాదని అతడితో జంప్

OMG: పెళ్లైన రెండు మూడు రోజులకే మరిదికి మనసిచ్చేసింది ఆ వదిన. అప్పటి నుంచీ వీరిద్దరి ప్రేమ బంధం కొనసాగుతోంది. చివరకు గత శుక్రవారం రోజున ఇంటి నుంచి పారిపోయారు.

OMG: పెళ్లైన రెండు మూడు రోజులకే మరిదికి మనసిచ్చేసింది ఆ వదిన. అప్పటి నుంచీ వీరిద్దరి ప్రేమ బంధం కొనసాగుతోంది. చివరకు గత శుక్రవారం రోజున ఇంటి నుంచి పారిపోయారు.

OMG: పెళ్లైన రెండు మూడు రోజులకే మరిదికి మనసిచ్చేసింది ఆ వదిన. అప్పటి నుంచీ వీరిద్దరి ప్రేమ బంధం కొనసాగుతోంది. చివరకు గత శుక్రవారం రోజున ఇంటి నుంచి పారిపోయారు.

  పెళ్లై 20 రోజులే అయింది. కొత్త జంట ఎంతో సంతోషంగా ఉంది. తమ ఇంటికి బంగారం లాంటి కోడలు వచ్చిందని అత్తామామలు అనుకున్నారు. మంచి భార్య దొరికిందని ఆ భర్త హ్యాపీగా ఉన్నాడు. కానీ అంతలోనే ఆ కొత్త పెళ్లికూతురు ఊహించని షాకిచ్చింది.  ఏ వదినా చేయకూడని పనిచేసింది. భర్తను వదిలేసి..మరిదిపై మనసు పారేసుకుంది. ఎంతలా అంటే.. పెళ్లై నెల రోజులు కూడా కాకుండానే... అతడితో వెళ్లిపోయింది.  ఉత్తరప్రదేశ్‌లో పిలిభిత్‌తో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వదినా, మరదుల వ్యవహారం స్థానికంగా సంచలనం సృష్టించింది.

  Gang Rape : ఫోన్ లో పోర్న్ చూసి..ఇద్దరు మైనర్ బాలికలపై గ్యాంగ్ రేప్

  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పురాన్‌పూర్ కొత్వాలి ప్రాంతంలోని ఒక గ్రామానికి చెందిన అనే యువకుడికి.. పిలిభిత్‌కు చెందిన యువతితో వివాహం జరిగింది. 20 రోజుల క్రితమే అంగరంగ వైభవంగా పెళ్లి వేడుకను నిర్వహించారు. వివాహం ఘనంగా జరగడంతో కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా ఉన్నారు. బంధువులు, చుట్టుపక్కల స్థానికులంతా నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లి తర్వాత కొత్త కోడలు అత్తింట్లో అడుగు పెట్టింది. అందరితో మంచిగా మాట్లాడుతూ..బాగానే ఉండేది. అన్ని పనులనూ చక్కగా చేసేది. మంచి భార్య దొరికిందని భర్త.. బంగారం లాంటి కోడలు వచ్చిందని అత్తామామలు ఎంతో సంతోషపడ్డారు. కానీ వారి సంతోషం ఎంతో కాలం నిలవలేదు. పెళ్లైన 20 రోజులకే కొత్త కోడలు విశ్వరూపం చూపించింది. ఎవరూ ఊహించని విధంగా.. అదే కుటుంబానికి చెందిన .. వరుసకు మరిది అయ్యే వ్యక్తితో ప్రేమలో పడింది. తొలి చూపులోనే పడిపోయింది. అంతే అప్పటి నుంచీ భర్తకు దూరంగా ఉంటూ.. మరిదితో సన్నిహితంగా మెలగడం ప్రారంభించింది. మరిదితో క్లోజ్‌గా ఉంటే.. వదినా మరుదులు అనుకున్నారే తప్ప... వీరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని ఎవరూ అనుకోలేదు.

  ఓరి భగవంతుడా ! .. ఏం తప్పు చేసిందయ్యా ఆ కుటుంబం.. అర్ధరాత్రి నిద్రలోనే..

  పెళ్లైన రెండు మూడు రోజులకే మరిదికి మనసిచ్చేసింది ఆ వదిన. అప్పటి నుంచీ వీరిద్దరి ప్రేమ బంధం కొనసాగుతోంది. చివరకు గత శుక్రవారం రోజున ఇంటి నుంచి పారిపోయారు. భర్తను వదిలేసి మరిదితో వెళ్లిపోయింది. వెళ్తూ.. వెళ్తూ.. ఇంటి నుంచి నగలను, డబ్బును కూడా ఎత్తుకెళ్లింది. ఆమె ఇంట్లో కనిపించకపోవడంతో అందరూ కంగారుపడ్డారు. చీకటి పడినా ఇంటికి రాలేదు. ఏమైందోనని అందరూ ఆందోళన చెందారు. కానీ ఇంట్లో బంగారం, డబ్బు కనిపించకపోవడంతో అనుమానం వచ్చింది. ఆ తర్వాత మరిదితో ఆమె వెళ్లిపోయిందని తెలిసి.. అందరూ షాక్ తిన్నారు. వరుడు కుటుంబ సభ్యులతో పాటు ఆమె పుట్టింటి వారు కూడా ఖంగుతిన్నారు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం చుట్టుపక్కల హాట్ టాపిక్‌గా మారింది.

  First published:

  Tags: Crime news, National News, Up news, Uttar pradesh

  ఉత్తమ కథలు