నా భర్త పుస్తకాలు వదలడం లేదు... విడాకులు ఇవ్వండి ప్లీజ్

చదువు..చదువు..ఎప్పుడూ ఇదే యావ..! దాంతో విసిగిపోయిన ఆ ఇల్లాలు భర్త నుంచి విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించింది. కోర్టు కౌన్సిలర్ ఇద్దరినీ పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చినా వారిలో మార్పు రాలేదు.

news18-telugu
Updated: August 31, 2019, 4:07 PM IST
నా భర్త పుస్తకాలు వదలడం లేదు... విడాకులు ఇవ్వండి ప్లీజ్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సివిల్స్‌కు సీరియస్‌గా ప్రిపేర్ అవుతానంటే ఇంట్లో అందరూ సపోర్ట్ చేస్తారు. చదవుకొని గొప్ప వాడిని అవుతానంటే ఎవరూ వద్దనరు. అవసరమైతే ఇంకాస్త ఎక్కువే సాయం చేస్తారు. కానీ ఆ ఇంట్లో సీన్ రివర్స్ అయింది. సివిల్స్‌కు సన్నద్ధమవుతున్న భర్తకు షాకిచ్చింది భార్య. సాధారణంగా వరకట్న వేధింపులు, శారీరక హింస, వివాహేతర సంబంధాల కారణాలతో మహిళలు విడాకులు కోరుకుంటారు. కానీ ఈమె మాత్రం వైరెటీ. తన భర్త పుస్తకాల పురుగుగా మారడని.. చదువులో పడి తమను పట్టించుకోవడం లేదని ఏకంగా విడాకులకు దరఖాస్తు చేసింది.

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ఓ వ్యక్తి UPSC పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. ఎలాగైనా సివిల్స్ కొట్టాలని సీరియస్‌గా చదువుతున్నాడు. అందుకోసం సినిమాలు, షికార్లు, మిత్రులతో కబుర్లు అన్నింటినీ వదిలేశాడు. కనీసం ఫ్యామిలీని కూడా పట్టించుకోవడం లేదు. చదువు..చదువు..ఎప్పుడూ ఇదే యావ..! దాంతో విసిగిపోయిన ఆ ఇల్లాలు భర్త నుంచి విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించింది. కోర్టు కౌన్సిలర్ ఇద్దరినీ పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చినా వారిలో మార్పు రాలేదు.

మరోవైపు భర్త మాత్రం తన లక్ష్యాన్ని వదలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నాడు. సివిల్స్ సాధించాలన్నది తన చిన్ననాటి కల అని..ఉద్యోగం వచ్చే వరకు విశ్రమించనని తెగేసి చెప్పాడు. ఇది తప్ప.. తమ కాపురంలో ఎలాంటి గొడవలు లేవని కోర్టుకు స్పష్టం చేశాడు. ఉద్యోగం వచ్చే వరకు తనకు సహకరించాలని భార్యను కోరాడు. ఐనా భార్య వినకపోవడంతో అతడు కూడా విడాకుల కోసం పిటిషన్ వేశాడు. ఐతే కేసు విచారణకు సమయం ఉన్నందున మరోసారి దంపతులను పిలిచి కౌన్సెలింగ్ ఇవ్వాలని భావిస్తున్నాడు కౌన్సిలర్. ఈ వెరైటీ విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టులో చర్చనీయాంశంగా మారింది.First published: August 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>