హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shoking : పెళ్లైన 5 నెలలకే..కట్నం తేలేదని భార్యను చంపి శవాన్ని అదృశ్యం చేసిన భర్త,అత్తమామలు

Shoking : పెళ్లైన 5 నెలలకే..కట్నం తేలేదని భార్యను చంపి శవాన్ని అదృశ్యం చేసిన భర్త,అత్తమామలు

కట్నం కోసం నవవధువు హత్య

కట్నం కోసం నవవధువు హత్య

Newly wed woman killed:బీహార్(Bihar)లో ఘోరం వెలుగుచూసింది. పెళ్లి అయిన 5 నెలలకే మహిళను కట్నం(Dowry) కోసం హింసించిన భర్త,అత్తమామలు చివరికి ఆమెను చంపేసినట్లు సమాచారం.

Newly wed woman killed:బీహార్(Bihar)లో ఘోరం వెలుగుచూసింది. పెళ్లి అయిన 5 నెలలకే మహిళను కట్నం(Dowry) కోసం హింసించిన భర్త,అత్తమామలు చివరికి ఆమెను చంపేసినట్లు సమాచారం. హంతకులు నవ వధువు(Newly Wed Woman)మృతదేహాన్ని కూడా అదృశ్యం చేశారని తెలుస్తోంది. ఈ షాకింగ్ సంఘటన వెస్ట్ చంపారన్ జిల్లాలోని బగహాలోని బత్వారియా పోలీస్ స్టేషన్ పరిధిలోని పిప్రా భాటియా గ్రామంలో వెలుగుచూసింది. మహిళను భర్త,అత్తమామలు కలిసి హత్య చేసిన ఉదంతం స్థానికంగా సంచలనం రేపింది.

బత్వారియా పోలీస్ స్టేషన్ పరిధిలోని పిప్రా భాటియా గ్రామానికి చెందిన సందీప్ ఠాకూర్ కి ఈ ఏడాది ఫిబ్రవరి 9న ఫూల్‌శాంతి దేవి అనే మహిళతో వివాహం జరిగింది. అయితే పెళ్లి అయిన కొద్ది రోజులకే పూల్ శాంతి దేవికి కట్న వేధింపులు మొదలయ్యాయి. పుట్టింటి నుంచి డబ్బు తీసుకొచ్చి బైక్‌, కుట్టుమిషన్లు కొనివ్వాలని తమ కూతురిని నిత్యం భర్త,అత్తమామలు వేధించేవారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే వారి డిమాండ్‌ను నెరవేర్చకపోవడంతో తమ కుమార్తెపై అత్తమామల వేధింపులు పెరిగాయన్నారు. జూన్ 27న తెల్లవారుజామున 4 గంటలకు అల్లుడు సందీప్ ఠాకూర్‌ నుంచి కాల్ వచ్చిందని మృతురాలి తండ్రి ప్రయాగ్ ఠాకూర్ చెప్పారు.మీ అమ్మాయి ఇంట్లో లేదని ఫోన్‌లో సమాచారం వచ్చిందని..తాను వెంటనే పిప్రా భాథియాకు వెళ్లగా ఫూల్‌శాంతి దేవి ఇంట్లో లేదని చెప్పారు. ప్రయాగ్ ఠాకూర్ తన కూతురిని హత్య చేసిన తర్వాత మృతదేహం కనిపించకుండా చేశాడని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయాగ్ ఠాకూర్ ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌ఓ అమిత్ కుమార్ పాండే తెలిపారు. సందీప్ ఠాకూర్, అతని తండ్రి మున్నా ఠాకూర్‌తో సహా నలుగురిపై కేసు నమోదు చేశారు. పెళ్లి తర్వాత ఫూల్‌శాంతిని అల్లుడు సందీప్ ఠాకూర్, మామ మున్నా ఠాకూర్‌తో సహా అత్తగారు వేధింపులకు గురిచేశారని ప్రయాగ్ ఠాకూర్ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ద్విచక్రవాహనం, కుట్టుమిషన్‌ను కట్నం డిమాండ్‌ చేస్తున్నారని ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.


OMG : దటీజ్ ఇండియన్ రైల్వే..నది వంతెనపై ఏకకాలంలో ఐదు రైళ్లు నడిపి కొత్త రికార్డ్

మరోవైపు,కర్ణాటక(Karnataka)లో దారుణం జరిగింది. భార్య (Wife)మరికొ వ్యక్తితో జంప్ అయిందన్న కోపంలో కన్నబిడ్డలను దారుణంగా హత్య చేశాడు ఓ భర్త. అంతేకాకుండా హత్య తర్వాత వారి మృతదేహాలను ఆటో సీటు కింద పెట్టి రోజంతా ఆటోని నడిపాడు. పాపం సీటు కింద మృతదేహాలు ఉన్నాయని తెలియక ఆ సీటుపై కూర్చొని ప్రయాణించారు చాలామంది. అనంతరం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు నిందితుడు. ఈ దారుణ ఘటన కర్ణాటకలో రాష్ట్రంలోని కలబుర్గిలో మంగళవారం జరిగింది. మృతులను సోని(10), మయూరి (8)గా గుర్తించారు. హత్య తర్వాత వారి మృతదేహాలను ఆటో సీటు కింద పెట్టి రోజంతా ఆటోని నడిపాడు. పాపం సీటు కింద మృతదేహాలు ఉన్నాయని తెలియక ఆ సీటుపై కూర్చొని ప్రయాణించారు చాలామంది. అనంతరం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు నిందితుడు లక్ష్మీకాంత్.

First published:

Tags: Bihar, Dowry harassment, Husband kill wife

ఉత్తమ కథలు