పెళ్లై 15 రోజులు కూడా కాలేదు. ఇంకా కాళ్ల పారాని సైతం ఆరలేదు. ఎన్నో ఊహలతో..మరెన్నో ఆశలతో..అత్తారింట్లోకి అడుగుపెట్టిన ఆ నవ వధువు..అప్పుడే నరకం చూసింది. ఇంట్లోకి వెళ్లిన మరుసటి రోజే ఆమెకు తెలిసివచ్చింది..అది ఇల్లు కాదు నరకమని..! వాళ్లు కుటుంబ సభ్యులు కాదు..రాక్షసులని..! నవ వధువుపై భర్త బంధువులు, ఓ తాంత్రికుడు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. పెళ్లైన నాటి నుంచి నిత్యం నరకం చూపించారు. హర్యానాలోని యమునానగర్‌లో ఈ దారుణం జరిగింది.
బాధితురాలి తండ్రి కథనం ప్రకారం..కురుక్షేత్రకు చెందిన యువతికి యమునానగర్‌కు చెందిన యువకుడితో సెప్టెంబర్ 12న వివాహమైంది. పెళ్లైన రోజే అత్తింటి వారు ఓ తాంత్రికుడిని ఇంటికి పిలిపించారు. అప్పటి నుంచీ ఇంట్లో పూజలు జరుగుతున్నాయి. పూజల అనంతరం నవ వధువుకు మత్తుమందు ఇచ్చి..భర్త బంధువులు, తాంత్రికుడు అత్యాచారానికి పాల్పడ్డారు. భర్త సోదరుడితో పాటు భర్త బావమరిది ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. నవ వధువుకు ఆరోగ్యం బాగోలేదని..ఆమె తండ్రికి ఫోన్‌చేసి ఇటీవల పిలిపించారు. తనపై జరిగిన అఘాయిత్యాన్ని తండ్రికి చెప్పుకొని బోరున విలపించింది బాధితురాలు.
సాక్షాలు దొరకకుండా బాధితురాలి దుస్తులను సైతం తగులబెట్టినట్లు తెలుస్తోంది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఐతే ఈ వ్యవహారంలో భర్త పాత్రపైనా అనుమానాలు కలుగుతున్నాయి. ఇంట్లో ఇంత జరుగుతున్నా అడ్డుకోకపోవడం గమనార్హం. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు అత్తింటి వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తదుపరి విచారణ కోసం కేసును యమునానగర్ పీఎస్‌కు బదిలీ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.