దుస్తులు మార్చుకుంటానని చెప్పి.. గదిలో విగతజీవిలా నవ వధువు..

మంగళవారం రోజు దుస్తులు మార్చుకుంటానని చెప్పి భర్తను గది నుంచి బయటకు పంపించింది.ఆ తర్వాత ఎంతకీ గది నుంచి బయటకు రాకపోవడంతో.. ఆమె భర్త గది లోపలకి వెళ్లి చూశాడు.

news18-telugu
Updated: August 22, 2019, 10:37 AM IST
దుస్తులు మార్చుకుంటానని చెప్పి.. గదిలో విగతజీవిలా నవ వధువు..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: August 22, 2019, 10:37 AM IST
కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జుజ్జూరులో విషాదం చోటు చేసుకుంది. పెళ్లయి 24 గంటలు గడిచిందో లేదో.. ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. కడుపు నొప్పి కారణంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చునని తల్లిదండ్రులు చెబుతున్నప్పటికీ.. ఇష్టం లేని పెళ్లి కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లాలోని బజ్జూరుకు చెందిన రామయ్య-ప్రకాశమ్మ దంపతుల కుమార్తె కల్యాణికి కొడవటిగల్లుకు చెందిన నాగరాజు అనే యువకుడితో సోమవారం వివాహం జరిగింది. మంగళవారం రోజు దుస్తులు మార్చుకుంటానని చెప్పి భర్తను గది నుంచి బయటకు పంపించింది.ఆ తర్వాత ఎంతకీ గది నుంచి బయటకు రాకపోవడంతో.. ఆమె భర్త గది లోపలకి వెళ్లి చూశాడు. ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించడంతో ఒక్కసారిగా షాక్ తిన్నాడు. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. కల్యాణి కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోందని.. అందుకే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు.అయితే ఇష్టం లేని పెళ్లి కారణంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడిందా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

First published: August 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...