హోమ్ /వార్తలు /క్రైమ్ /

Newly Married Women: వివాహం జరిగి మూడు వారాలు.. అత్తింటికి మస్కా కొట్టిన కోడలు.. అసలేం జరిగిందో తెలిస్తే షాక్..

Newly Married Women: వివాహం జరిగి మూడు వారాలు.. అత్తింటికి మస్కా కొట్టిన కోడలు.. అసలేం జరిగిందో తెలిస్తే షాక్..

Newly Married Women: పెళ్లి జరిగిన మూడు వారాలకు కట్టుకున్న భర్తకు, అత్తింటివారికి మత్తు మందు ఇచ్చిన కొత్త కోడలు పట్టుచీరలు, నగలతో పరారైంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బాహ్ సిటీలో గురువారం ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

  ఆ ఇంట్లో మూడు వారాల క్రితం అంగ‌రంగ వైభ‌వంగా వివాహం జ‌రిగింది. పెళ్లికి తెలిసిన వారు, బంధువులు అందరూ వచ్చారు. కొత్త కోడ‌లు ఇంట్లో అడుగుపెట్టింది. కోడలు ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఆలుమగలు అన్యోన్యంగా కలిసిమెలిసి ఉన్నారు. ఇది చూసి ఆమె అత్త‌మామ‌లు మురిసిపోయారు. ఆమె భర్త వారి బంధువులు అంతా ముచ్చటించారు. కానీ వాళ్ల మురిపెం మూన్నాళ్ల ముచ్చ‌ట‌గానే మిగిలిపోయింది. పెండ్ల‌యిన మూడు వారాల‌కే కొత్త కోడ‌లు అత్తింటి వాళ్ల‌కు టోక‌రా ఇచ్చింది. భ‌ర్త‌, అత్త‌మామ‌ల‌కు పాల‌ల్లో మ‌త్తు క‌లిపి ఇచ్చి న‌గ‌లు, ప‌ట్టుచీర‌ల‌తో పారిపోయింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఆగ్రా రూర‌ల్ ఏరియాలోని బాహ్ సిటీలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఆగ్రా రూరల్ ఏరియాలోని బాహ్ సిటీకి చెందిన ఉపేంద్ర (22)కు ఈ నెల 7న శాలిని (20)తో వివాహం జ‌రిగింది. పెళ్లి జరిగిన మూడు వారాల పాటు శాలిని తన భర్త, అత్తింటి వారితో బాగానే క‌లిసిపోయినట్లు నటించింది.

  కానీ ఓ రోజు రాత్రి మాస్టర్ ప్లాన్ వేసింది. రాత్రి పడుకునే ముందు తన భ‌ర్త‌కు, అత్త‌మామ‌ల‌కు ఎప్పటిలాగే పాలు ఇచ్చింది. కానీ ఆ పాల‌ల్లో మ‌త్తు మందు క‌లిపి ఇచ్చింది. వాళ్లు ఆ పాలుతాగి మ‌త్తులోకి జారుకోగానే ఇంట్లో విలువైన న‌గ‌లు, బ‌ట్ట‌లు తీసుకుని అక్కడ నుంచి పరారయ్యింది. మత్తులో అలానే నిద్రపోయిన వారు ఉదయం లేచారు. లేచి చూసేసరికి ఇళ్లంతా చిందరవందరగా పడి ఉంది. ఎక్కడ చూసిన కోడలు మాత్రం అత్తమామలకు కనిపించలేదు. దీంతో ఉపేంద్ర‌, అత‌ని తల్లిదండ్రులు ఇళ్లుతో పాటు చట్టుపక్కల వెతికినా ఆమె జాడ తెలియ‌లేదు.

  చివ‌రికి అనుమానం వ‌చ్చి బీరువా తీసి చూడ‌గా అందులోని విలువైన న‌గ‌లు, బ‌ట్ట‌లు మాయ‌మ‌య్యాయి. కొత్తగా ఇంట్లోకి వచ్చిన కోడలే ఇలా చేసి ఉంటుందని అనుమానించి ఉపేంద్ర, అతడి తండ్రి ఠాకూర్ దాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  First published:

  Tags: Agra, Crime, Gold robbery, Uttarapradessh

  ఉత్తమ కథలు