NEWLY MARRIED WOMAN WENT WITH HIS LOVER AFTER MOVING TO HIS IN LAWS HOUSE IN MADHYA PRADESH AK
Wife on lover bike: కాస్త కారు ఆపాలన్న కొత్త పెళ్లికూతురు.. ఇంతలోనే ఊహించని ఘటన.. ఒక్కసారిగా అంతా షాక్
ప్రతీకాత్మక చిత్రం
వివాహ వేడుకలు పూర్తయిన అనంతరం మంగళవారం మధ్యాహ్నం వధువుకు వీడ్కోలు పలికి వధువు వరుడితో కలిసి కారులో అత్తమామల ఇంటికి వెళ్లారు. అయితే ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది.
మూడు రోజుల క్రితం ఆమెకు పెళ్లయ్యింది. అంగరంగ వైభవంగా ఆమెకు పెళ్లి చేశారు ఆమె తల్లిదండ్రులు. కానీ పెళ్లి జరిగిన రెండు రోజులకే పెళ్లి చేసిన ఆమె తల్లిదండ్రులకు.. ఆమెతో ఏడడుగులు వేసిన భర్తకు ఊహించని షాక్ తగిలింది. తన భార్యతో జీవితాంతం కలిసి ఉండాలని భావించి కలలకన్న ఆమె భర్త ఆశలు కేవలం కొద్దిగంటల్లోనే ఆవిరయ్యాయి. అంతా చూస్తుండగానే పెళ్లికొడుకు, వారి కుటుంబసభ్యులకు కొత్త పెళ్లి కూతురు అదిరిపోయే షాక్ ఇచ్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సాత్నా సమీపంలో చోటు చేసుకుంది. డిసెంబర్ 14న సాత్నాకు చెందిన అహిర్గావ్కి చెందిన కుష్వాహా కుటుంబంలో వివాహం జరిగింది. సోమవారం సాయంత్రం వరుడు ఊరేగింపుతో ఇక్కడికి చేరుకున్నాడు. మొత్తం హిందూ సంప్రదాయం ప్రకారం, అతను వధువుతో ఏడడుగులు వేశాడు.
వివాహ వేడుకలు పూర్తయిన అనంతరం మంగళవారం మధ్యాహ్నం వధువుకు వీడ్కోలు పలికి వధువు వరుడితో కలిసి కారులో అత్తమామల ఇంటికి వెళ్లారు. అయితే ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది. కారు కేవలం 4 కి.మీ దూరం వెళ్లిన తరువాత వధువు కారు ఆపాలని భర్త, అత్తింటివారిని కోరింది. ఆమె కారు ఎందుకు ఆపమని అడిగిందో వారికి తెలియలేదు. అయితే అసలు విషయం తెలుసుకునే లోపుగానే అంతా జరిగిపోయింది. కారు దిగి వెంటనే పక్క నుంచి వచ్చిన మోటార్ సైకిల్‌పై ఆమె వెళ్లిపోయింది. బైక్‌పై వచ్చిన తన ప్రియుడు అశోక్ యాదవ్‌తో కలిసి పారిపోయింది.
ఈ ఘటనతో షాక్‌కు గురైన వరుడు తిరిగి గ్రామానికి వెళ్లి బాలిక కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. సమాచారం అందిన వెంటనే వధువు కుటుంబీకులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మరోవైపు ఈ సంఘటన తర్వాత వధువు సోదరుడు సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు హుటాహుటిన వచ్చి చుట్టుపక్కల వారిని అదుపులోకి తీసుకున్నారు.
అర్థరాత్రి మొబైల్ లొకేషన్ ఆధారంగా పోలీసులు అమ్మాయిని, అబ్బాయిని పట్టుకున్నారు. పోలీసులు కొత్త పెళ్లికూతురిని ఉన్నతాధికారి ముందు హాజరుపరిచారు. అయితే తన అత్తమామల ఇంటికి, తన తల్లి ఇంటికి వెళ్లబోనని అమ్మాయి వారికి చెప్పింది. తన ప్రేమికుడు అశోక్‌తో తన జీవితాన్ని గడపాలనుకుంటున్నట్లు వివరించింది. ఆ తరువాత వధువు తన నగలన్నీ తన తల్లి తరపు బంధువులకు ఇచ్చింది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.