Home /News /crime /

NEWLY MARRIED WOMAN TOOK HER OWN LIFE BY CONSUMING POISON DUE TO THE OLD GIRLFRIEND COMING IN BETWEEN HUSBAND AND WIFE SSR

Couple: ఎనిమిది నెలల క్రితం పెళ్లైన వీళ్ల లైఫ్‌లోకి అతని మాజీ లవర్ రీఎంట్రీ వల్ల ఎంత పని జరిగిందంటే..

కోమల్, శివమ్ గైక్వాడ్

కోమల్, శివమ్ గైక్వాడ్

ఈరోజుల్లో పెళ్లిళ్లు చేసుకుంటున్న యువతలో చాలామందికి పాస్ట్ లవ్ స్టోరీలు ఉంటున్నాయి. ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కాకపోవడానికి బ్రేకప్ కారణం కావచ్చు. ఇంట్లో పెద్దలకు ఒప్పుకోకపోవడంతో ప్రేమించిన వ్యక్తిని మర్చిపోయి ఇంకొకరితో పెళ్లికి సిద్ధపడటం కావచ్చు. ఇలా కారణం ఏదైనా పెళ్లికి ముందు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి జీవితంలో ఓ ప్రేమించిన వ్యక్తి కామన్‌గా ఉంటున్నారు.

ఇంకా చదవండి ...
    ఇండోర్: ఈరోజుల్లో పెళ్లిళ్లు చేసుకుంటున్న యువతలో చాలామందికి పాస్ట్ లవ్ స్టోరీలు ఉంటున్నాయి. ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కాకపోవడానికి బ్రేకప్ కారణం కావచ్చు. ఇంట్లో పెద్దలకు ఒప్పుకోకపోవడంతో ప్రేమించిన వ్యక్తిని మర్చిపోయి ఇంకొకరితో పెళ్లికి సిద్ధపడటం కావచ్చు. ఇలా కారణం ఏదైనా పెళ్లికి ముందు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి జీవితంలో ఓ ప్రేమించిన వ్యక్తి కామన్‌గా ఉంటున్నారు. అయితే.. పెళ్లి చేసుకుంటున్న యువత అంతా అలా ఉందని అనలేం కానీ చాలామందికి పాస్ట్ లవ్ స్టోరీలు, లవ్ ఫెయిల్యూర్ స్టోరీలు ఉంటున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ‘రాజారాణి’ సినిమాలో ఆర్య, నయనతార జీవితాల్లో ఉన్నట్టుగా.

    అయితే.. ఆ ప్రేమించిన వ్యక్తి పెళ్లి తర్వాత ఆ యువకుడి లేదా యువతి జీవితంలోకి వస్తే మాత్రం భార్యాభర్తల బంధంలో కలహాలు తప్పవు. కానీ.. ఆ కలహాలు భర్తకు భార్యను దూరం చేసేంత వరకూ వెళ్లకూడదు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో అదే జరిగింది. మాజీ ప్రేయసి పెళ్లయిన తన మాజీ ప్రియుడి జీవితంలోకి రీఎంట్రీ ఇవ్వడంతో అతని భార్య విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కుటుంబంలో విషాదం నింపింది.

    ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. కోమల్(18), శివరామ్ గైక్వాడ్ భార్యాభర్తలు. వీళ్లిద్దరికీ ఎనిమిది నెలల క్రితం పెళ్లైంది. ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కోమల్ ఓ చీరల దుకాణంలో పనిచేస్తుంటుంది. శివమ్ ఓ కేఫ్‌లో పనిచేసేవాడు. చెరో పని చేసుకుంటూ ఓ రూపాయి సంపాదించుకుంటూ ఉన్నంతలో సుఖంగా ఉంటున్న ఈ జంట జీవితంలోకి శివమ్ మాజీ ప్రియురాలు ఎంట్రీ ఇచ్చింది. శివమ్ ప్రవర్తనలో కొన్ని నెలలుగా కోమల్ మార్పు గమనించింది. తనతో అంతకు ముందులా ఉండటం లేదు. సరదాగా మాట్లాడటం లేదు. ఇంట్లో ఉండకుండా వీలైనంత వరకూ బయటే తిరుగుతూ శివమ్ తన మాజీ ప్రియురాలితో సంబంధం కొనసాగిస్తున్నాడు.

    కోమల్‌కు ఈ విషయం తెలిసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తనను మోసం చేయడానికి మనసెలా వచ్చిందంటూ శివమ్‌ను కోమల్ నిలదీసింది. గత కొద్దిరోజులుగా ఆ యువతి విషయంలో శివమ్, కోమల్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ పరిణామాలతో కోమల్ తీవ్ర మనస్తాపం చెందింది. తన మాజీ ప్రియురాలితో శివమ్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఫోన్‌లో మాట్లాడుతుంటాన్ని కోమల్ గమనించింది. భర్త ప్రవర్తన ఆమెను తీవ్రంగా బాధించింది. ఇక బతకకూడదని నిర్ణయించుకుంది. గత సోమవారం క్షణికావేశంలో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. శివమ్ ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కోమల్ మంగళవారం చనిపోయింది. కూతురి మృతికి అల్లుడే కారణమని కోమల్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

    ఇది కూడా చదవండి: Shocking: ఎందుకు పెళ్లి చేసుకుంటారో.. ఎందుకిలా చేస్తారో.. చేసిందంతా చేసి ఎంతబాగా...

    కోమల్ తండ్రి హేమరాజ్ మాట్లాడుతూ.. శివమ్ అలియాస్ బిట్టు తన కూతురితో పెళ్లయిన కొన్నాళ్లకే పనికెళ్లడం మానేశాడని.. కోమల్‌పై పలుమార్లు కొట్టి హింసించాడని చెప్పారు. అన్నీ దిగమింగుకుని కోమల్ చీరల దుకాణంలో పనికెళ్లి డబ్బు జాగ్రత్త చేస్తుంటే ఆ డబ్బు కూడా లాక్కుని జల్సాలకు ఖర్చు పెట్టుకునేవాడని కోమల్ తండ్రి ఆరోపించారు. పోలీసులు కోమల్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో శివమ్ అలియాస్ బిట్టుపై కేసు నమోదు చేశారు. అతని మాజీ ప్రియురాలి గురించి ఆరా తీస్తున్నారు. పెళ్లికి ముందు ఉన్న ప్రేమ పరిచయాలను మరొకరితో పెళ్లయ్యాక కూడా కొనసాగిస్తే పరిణామాలు ఎంతటి విషాదానికి దారితీస్తాయో ఈ ఘటన చెప్పకనే చెబుతోంది.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Crime news, Love marriage, Married women

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు