ఆమెకు పెళ్లి జరిగి కేవలం నెల రోజులు కూడా కాలేదు. ఇంతలోనే ఆమె ఇంట్లో నుంచి కనిపించకుండా పోయింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అడిక్‌మెట్ బాలాజీనగర్‌కు చెందిన బుగుడుల సాయికుమార్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి మే 30వ తేదీన సిద్దిపేట జిల్లా తోగుట గ్రామానికి చెందిన అంజయ్య కుమార్తె నాగరాణి(20)తో వివాహం జరిగింది. నాగరాణి ప్రస్తుతం భర్తతో కలిసి హైదరాబాద్‌లోనే ఉంటుంది. ఇక, మంగళవారం ఉదయం సాయికుమార్ ఉద్యోగానికి వెళ్లాడు. భర్త బయటకు వెళ్లాక.. మధ్యాహ్నం సమయంలో నాగరాణి ఇంట్లోని తన బట్టలు, నగలు తీసుకుని వెళ్లిపోయింది.
ఆ తర్వాత కొద్దిసేపటికీ ఈ విషయం గమనించిన సాయికుమార్ వదిన.. అతనికి ఫోన్ చేసి నాగరాణి కనిపించడం లేదని తెలిపింది. దీంతో వెంటనే ఇంటికి వచ్చిన సాయికుమార్ ఇంట్లోకి వెళ్లి చూశాడు. ఇంట్లో ఓ చోట భార్య సెల్‌ఫోన్ కనిపించింది. ఫోన్ స్విచ్ ఆన్ చేసి చూడగా.. అందులో నాగరాణికి ఆమె బాయ్‌ఫ్రెండ్ నుంచి వచ్చిన మెసేజ్‌లు కనిపించాయి.
ఈ క్రమంలోనే ఆందోళన చెందిన సాయికుమార్.. తన భార్య కనిపించడం లేదంటూ బుధవారం నల్లకుంట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పెళ్లికి ముందు కూడా నాగరాణి ఓ యువకుడితో వెళ్లిపోయిందని సాయికుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇప్పుడు కూడా నాగరాణి కనిపించకపోవడం వెనకాల అతడి హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. సాయికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.