భార్య మరణం.. రెండో పెళ్లి చేసుకున్న భర్త.. ఆమె కాపురానికి వచ్చిన మరుసటి రోజే ఆ ఇంట్లో కలకలం.. అసలేం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

భార్య ఈ మధ్యనే చనిపోయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి ఆలనా పాలనా చూసుకునేందుకయినా మరో పెళ్లి చేసుకుందామనుకున్నాడు. తన దగ్గరకు వచ్చిన కొన్ని సంబంధాల్లో ఓ యువతి పద్ధతిగా కనిపించింది. ఆ యువతి ఇంట్లో మాట్లాడాడు. మొత్తానికి పెళ్లి జరిగింది. కానీ..

 • Share this:
  అనుకున్నదొకటి, అయినదొక్కటి.. అంటూ సినిమాల్లో డైలాగ్ వింటుంటాం. కానీ ఈ వ్యక్తి లైఫ్ లో మాత్రం ఆ డైలాగ్ అచ్చంగా జరిగింది. భార్య ఈ మధ్యనే చనిపోయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి ఆలనా పాలనా చూసుకునేందుకయినా మరో పెళ్లి చేసుకుందామనుకున్నాడు. తన దగ్గరకు వచ్చిన కొన్ని సంబంధాల్లో ఓ యువతి పద్ధతిగా కనిపించింది. ఆ యువతి ఇంట్లో మాట్లాడాడు. వాళ్లు కూడా సరేనన్నారు. అంగరంగ వైభవంగా కాకున్నా, చెప్పుకోదగ్గ రీతిలోనే వారి పెళ్లి జరిగింది. పెళ్లయిన మరుసటి రోజే ఆమె కాపురానికి అతడి ఇంటికి వచ్చింది. తెల్లారిన తర్వాత భార్య ఇంట్లో కనిపించలేదు. పుట్టింటికి వెళ్లిందేమోననుకున్నాడు. అక్కడ కూడా లేకపోవడంతో ఊరంతా వెతికారు. చివరకు ఇంట్లో డబ్బులు, నగలు కూడా మాయమయ్యాయని తెలిసి ఆ భర్త కంగుతిన్నాడు. ఇంతకీ అసలేం జరిగిందంటే..

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం కమ్మవారి పల్లి గ్రామానికి చెందిన పయ్యావుల కేశమురళి భార్య ఆరు నెలల క్రితం మరణించింది. అనారోగ్యంతో ఆమె మృతిచెందింది. అయితే అప్పటికే అతడికి ఇద్దరు పిల్లలు. వారి ఆలనా పాలనా చూసుకోవడానికి మరో పెళ్లిచేసుకోమని బంధవులు కోరారు. దీంతో సరేనన్న కేశమురళి, పెళ్లి సంబంధాలుచూడటం మొదలు పెట్టాడు. నల్లమాడ మండలం శ్రీరెడ్డి వారి పల్లి గ్రామానికి చెందిన ఓ యువతిని ఇష్టపడ్డాడు. ఆ యువతి కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. వాళ్లు కూడా ఓకే చెప్పడంతో ఫిబ్రవరి 28వ తారీఖున పెద్దల సమక్షంలో వారి పెళ్లి జరిగింది.
  ఇది కూడా చదవండి: నీ నాలుగేళ్ల కొడుకు వల్ల నీకు ప్రాణహాని.. అని చెప్పిన జ్యోతిష్కుడు.. దారుణానికి తెగించిన తండ్రి.. అసలేం జరిగిందంటే..

  పెళ్లయిన మరుసటి రోజే అంటే మార్చి 1వ తారీఖున ఆమె కాపురానికి కేశమురళి ఇంటికి వచ్చింది. మార్చి రెండో తారీఖున ఉదయం నుంచి ఆమె కనిపించకుండా పోయింది. ఎక్కడకు వెళ్లిందా అని ఆరా తీశారు. ఊరంతా వెతికారు. ఆమె పుట్టింటి వాళ్లను కూడా కనుక్కున్నారు. ఎక్కడా ఆమె కనిపించలేదు. దీంతోపాటు ఇంట్లోనే ఉన్న మూడు తులాల బంగారు నగలతోపాటు 80వేల రూపాయలు కూడా మిస్సయినట్టు కేశమురళి గుర్తించాడు. అంతటా విచారణ చేసిన తర్వాత ప్రియుడితోపాటు ఆమె ఒడిశాలో ఉన్నట్టు అతడికి తెలిసింది. దీంతో బుధవారం కేశమురళి ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆమె కోసం గాలిస్తున్నారు.
  ఇది కూడా చదవండి: సెలూన్‌లో పనిచేసే 23 ఏళ్ల కుర్రాడు.. హైదరాబాద్ లో సాఫ్ట్‌వేర్‌ యువతి.. కులం, మతం వేరైనా ఆమె పెళ్లికి సిద్ధపడినా..
  Published by:Hasaan Kandula
  First published: