పెళ్లయిన రెండు రోజులకే ఆ ఇంట్లో తీవ్ర విషాదం..

పెళ్లయిన రెండో రోజునే నవవధువు మృతి చెందిన సంఘటన శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గరుడఖండి గ్రామంలో చోటు చేసుకుంది.

news18-telugu
Updated: December 1, 2019, 10:24 AM IST
పెళ్లయిన రెండు రోజులకే ఆ ఇంట్లో తీవ్ర విషాదం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పెళ్లయిన రెండో రోజునే నవవధువు మృతి చెందిన సంఘటన శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గరుడఖండి గ్రామంలో చోటు చేసుకుంది. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. గరుడఖండి గ్రామానికి చెందిన సిగిలిపల్లి దమయంతికి తురకలకోటకు చెందిన గోపీనాథ్‌తో ఈ నెల 28న నందిగాం
మండలంలోని సుబ్బమ్మపేటలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వివాహం జరిగింది. శనివారం తెల్లవారుజామున దమయంతికి గుండెపోటు రావడంతో కుప్పకూలింది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. పెళ్లయిన రెండు రోజులకే నవ వధువు మృతి చెందడం ఇరు కుటుంబాలతో పాటు గ్రామస్తులను కంటతడి పెట్టించింది.
Published by: Srinivas Mittapalli
First published: December 1, 2019, 10:24 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading