సమాజంలో ఈ మధ్య నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. చిన్న చిన్న కారణాలకే చనిపోతున్నారు. చంపేస్తున్నారు. ఏ చిన్న కష్టమొచ్చినా చాలు.. దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాల్సింది పోయి.. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మానసికంగా కుంగిపోయి బలవన్మరణానికి పాల్పడుతున్నారు. మరికొందరేమో క్షణికావేశంలో ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా మహబూబ్‌నగర్‌లో విషాధ ఘటన చోటు చేసుకుంది. అప్పగింతలు కాకముందే నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఉదయమే పెళ్లి జరిగింది. అదే రోజు సాయంత్రం ఆమె ప్రాణాలు తీసుకుంది. దూర ప్రాంతానికి చెందిన వ్యక్తితో పెళ్లి చేశారనే మనస్థాపంతో ఆమె తనువు చాలించింది.
AP Crime News: వద్దని చెప్పినా వినడం లేదని.. అత్తని చంపిన కోడలు..? కారణం అదేనా..?
స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం...మహబూబ్ నగర్ టౌన్‌కు చెంది గుజ్జుల పద్మ వ్యవసాయ కూలీ. ఆమెకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఎంతో కష్టపడి.. పిల్లలను పెంచి పెద్ద చేసింది. పెద్ద కుమార్తె వయసు 18. పదో తరగతి వరకు చదివి ఇంటికి వద్దే ఉంటోంది. ఇటీవలే ఆమెకు పెళ్లి నిశ్చయమయింది. తన చిన్నమ్మ తమ్ముడు మల్లిఖార్జున్‌కు ఇచ్చి పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. ఐతే అతడి స్వస్థల అనంతపూర్ జిల్లా. అంతదూరంలోని పెళ్లి సంబంధం తనకు ఇష్టం లేదని ఆ యువతి పదే పదే తల్లికి చెప్పింది. దూర ప్రాంతమయితే ఏమవుతుంది? ఇది మంచి సంబంధం అని నచ్చజెప్పింది. తల్లి చెప్పిన మాట విని ఆమె పెళ్లి చేసుకుంది. వధువు ఇంట్లోనే వివాహ వేడుక జరిపారు. అప్పటి వరకు అంతా బాగానే ఉంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సందడి మధ్య వివాహం ఘనంగా జరిగింది.
Different Marriage: అక్కడ జంబలకడి పండ.. ఇది సినిమా కాదు నిజం.. కావాలంటే చూడండి
కానీ పెళ్లైన తర్వాత.. మళ్లీ ఏమైందో ఏమో.. ఆ నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం ఉదయం 9గంటలకు వివాహం జరిగితే.. సాయంత్రం అప్పగింతలకు ముందే వధువు బలవన్మరణానికి పాల్పడింది. విషం తాగడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన మహబూబ్ నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు పరీక్షలు చేసిన వైద్యులు అప్పటికే ఆమె మృతిచేసినట్లు ప్రకటించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు చేస్తున్నట్లు మహబూబ్ నగర్ వన్ టౌన్ ఠాణా ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. అత్తవారిల్లు దూరంగా ఉండడమే కారణమా? ఇంకేదైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లైన రోజే వధువు మరణించడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగాయి. వధువు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Mahabubnagar, Marriage, Wedding