Timmapur Car Accident: నవ వధువు ఇక లేదు.. డ్రైవర్ ఏమయ్యాడు.. కారు కొట్టుకుపోయాక ఏం జరిగిందంటే..

చనిపోయిన ప్రవళిక, వాగులో కొట్టుకుపోయిన కారు

తిమ్మాపూర్ వాగులో కారు కొట్టుకుపోయిన ఘటన నవ వధువు మృతితో విషాదాంతమైంది. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం రావులపల్లి సమీపంలోని తిమ్మాపూర్ వాగులో నవ వధూవరులు, బంధువులు ప్రయాణిస్తున్న ఓ కారు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే.

  • Share this:
    వికారాబాద్: తిమ్మాపూర్ వాగులో కారు కొట్టుకుపోయిన ఘటన నవ వధువు మృతితో విషాదాంతమైంది. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం రావులపల్లి సమీపంలోని తిమ్మాపూర్ వాగులో నవ వధూవరులు, బంధువులు ప్రయాణిస్తున్న ఓ కారు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో వరుడు, అతని అక్క రాధిక కారు అద్దాలు పగులకొట్టుకుని బయటపడగా.. వధువు ప్రవళిక, వరుడి మరో అక్క శ్వేత మృతదేహాలు సోమవారం లభ్యమయ్యాయి. నర్సాపూర్‌కు చెందిన శ్వేత(30), ఆమె ఎనిమిదేళ్ల కొడుకు శశాంక్ చనిపోవడంతో నర్సాపూర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్వేత భర్త లక్ష్మీనారాయణ రెడ్డి రామచంద్రాపూర్‌లో ఉంటూ వ్యాపారం చేస్తుండేవాడు. ఆరు నెలల క్రితం కుటుంబంతో సహా నర్సాపూర్ వచ్చి అప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు. తమ్ముడు పెళ్లికి వెళ్లి శ్వేత చనిపోవడంతో బాధిత కుటుంబం పుట్టెడు దు:ఖంతో కుమిలిపోతోంది. ఇదిలా ఉండగా.. ఈ కారు ప్రమాదం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, వద్దని చెప్పినా డ్రైవర్ వినిపించుకోకుండా వాగును దాటేందుకు డ్రైవ్ చేయడం వల్లే కారు కొట్టుకుపోయిందనే ప్రచారం ఎక్కువగా జరిగింది. అయితే.. ఈ కారు నడిపిన డ్రైవర్ ఏమయ్యాడన్న ప్రశ్నకు తాజాగా సమాధానం దొరికింది.

    వాగు ఉధృతిలో కారుతో పాటు కొట్టుకుపోయిన కారు డ్రైవర్ రాఘవేందర్‌రెడ్డి ఆదివారం రాత్రే ప్రమాదం నుంచి బయటపడినట్లు డీఎస్పీ సంజీవరావు చెప్పారు. వాగులో కొట్టుకుపోయిన కారు కిలోమీటరు దూరం వెళ్లి, చెట్టు కొమ్మలు అడ్డు పడటంతో ఆగిపోయిందన్నారు. ఆ సమయంలోనే కారు డ్రైవర్ కారులో నుంచి నీళ్లలోకి దూకి.. అలానే ఈదుకుంటూ.. ఓ చెట్టు కొమ్మను పట్టుకుని రెండు గంటల పాటు అలానే ఉన్నాడని తెలిపారు. వరద ప్రవాహం తగ్గాక.. అర్ధరాత్రి ఒడ్డుకు చేరుకున్నాడని.. అలా ప్రాణాలతో బయటపడినట్లు డీఎస్పీ చెప్పారు. అయితే.. ఈ ప్రమాదానికి కారణం తనేనన్న భయంతో.. దాడి చేస్తారేమోనన్న భయంతో ఆరోజు రాత్రి అంరాద్‌కుర్దు గ్రామానికి వెళ్లి.. ఆ గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి దాక్కున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అతని ఆచూకీ తెలుసుకున్న పోలీసులు డ్రైవర్ రాఘవేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు.

    ఇది కూడా చదవండి: Very Sad: ఈ మధ్యే నిశ్చితార్థం జరిగింది.. రోజూలానే ఉదయం 7 గంటలకు నడుచుకుంటూ ఆఫీస్‌కు వెళుతుండగా..

    ఇదిలా ఉండగా.. యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. కుర్రారం గ్రామానికి వెళుతున్న ఇద్దరు యువతులు దోసల వాగులో కొట్టుకుపోయి మృతి చెందారు. హిమబిందు(22), సింధూజ(25) అనే ఇద్దరు యువతులు శ్రవణ్ కుమార్ అనే యువకుడు నడుపుతున్న బైక్‌పై వెనుక కూర్చున్నారు. వాగు దాటే క్రమంలో బైక్ ఆగిపోయింది. ప్రవాహ ఉధృతికి బైక్ నీళ్లలో కొట్టుకుపోయింది. బైక్ పోతే పోయిందని ప్రాణాలు కాపాడుకోవాలని ఒకరినొకరు పట్టుకుని వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తూ కాలు జారి హిమబిందు, సింధుజ నీళ్లలో కొట్టుకుపోయారు. గాలింపు చర్యల్లో సింధూజ జాడ తెలిసినా అప్పటికే ఆలస్యమైంది. ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే సింధూజ చనిపోయిందని వైద్యులు తెలిపారు. హిమబిందు ఆచూకీ కోసం గాలిస్తున్నారు. తెలంగాణలో పొంగిపొర్లుతున్న వాగులూ, వంకలూ ఇలా నిండు ప్రాణాలను బలి తీసుకోవడం శోచనీయం.
    Published by:Sambasiva Reddy
    First published: