Home /News /crime /

NEWLY MARRIED WOMAN COMMITS SUICIDE DUE TO DOWRY HARASSMENT BY HUSBAND IN KURNOOL DISTRICT HSN

చిన్నప్పుడే తల్లిదండ్రుల మృతి.. బంగారం, రూ.15 లక్షల కట్నమిచ్చి పెళ్లి చేసిన మేనమామ.. కానీ మూడు నెలల్లోనే ఘోరం..!

మనీషా (ఫైల్ ఫొటో)

మనీషా (ఫైల్ ఫొటో)

చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. దీంతో ఆమెను మేనమామ అల్లారు ముద్దుగా చూసుకున్నాడు. పెళ్లి కూడా ఘనంగా చేశాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 లక్షల రూపాయల కట్నం, 20 తులాల బంగారాన్ని వరుడికి కట్నంగా ఇచ్చాడు.

    చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. అయినా ఆ బాలికకు ఆ లోటు తెలియకుండా పెంచాడా మేనమామ. ఉన్నత చదువులు చదివించాడు. అల్లారు ముద్దుగా చూసుకున్నాడు. పెళ్లి కూడా ఘనంగా చేశాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 లక్షల రూపాయల కట్నం, 20 తులాల బంగారాన్ని వరుడికి కట్నంగా ఇచ్చాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఆమె గురించి తెలిసి భార్యను బంగారంలా చూసుకోవాల్సిన భర్త కాస్తా శాడిస్టులా మారాడు. అదనపు కట్నం కోసం వేధించాడు. ఇప్పటికే తన కోసం తన మామయ్య ఎన్నో కష్టాలు పడ్డాడనీ, పెళ్లయ్యాక కూడా ఇంకా అదనపు కట్నం కోసం మామయ్యను ఇబ్బందులు పెట్టలేనని ఆ యువతి తీవ్రమైన మానసిక వేదనకు గురయింది. అంతే భర్త వేధిస్తున్నాడని మేనమామకు చెప్పలేక, భర్తను ఎదురించలేక చివరకు ప్రాణం తీసుకుంది. కర్నూలులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని మాల్దార్ పేటకు చెందిన మనీషా అనే 20 ఏళ్ల యువతి తల్లిదండ్రులు చిన్నప్పుడే మరణించారు. దీంతో ఆమె బాగోగులను ఆమె మేనమామే చూసుకున్నాడు. ఇంటర్మీడియట్ వరకు చదివించాడు. 20 ఏళ్ల వయసులో ఆమెకు పెళ్లి చేశాడు. నంద్యాల పట్టణంలోనే చింతరుగు వీధికి చెందిన రాజేష్ అనే వ్యక్తితో జనవరిలో మనీషా పెళ్లి జరిగింది. అతడు మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తుంటాడు. పెళ్లి సమయంలో అబ్బాయి తరపు వాళ్లు అడిగినంత కట్నం ఇచ్చారు. దాదాపు 15 లక్షల రూపాయల కట్నంతోపాటు 20 తులాల బంగారాన్ని కూడా ఆమెకు కానుకగా ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు.
    ఇది కూడా చదవండి: వివాహితతో 23 ఏళ్ల కుర్రాడు ఎస్కేప్.. బస్టాండ్ లో పట్టుకుని ఊళ్లో పంచాయితీ.. అందరిముందు ఆమె చెప్పిన మాటలతో..

    తల్లిదండ్రులు లేని పిల్ల అని బాగా చూసుకోవాల్సిన భర్తే, ఆమెపై వేధింపుల పర్వాన్ని మొదలు పెట్టాడు. తన వ్యాపారం కోసం అదనపు కట్నం తేవాలని ఆమెను హింసించాడు. తన కోసం ఇప్పటికే తన మామయ్య ఎన్నో త్యాగాలు చేశాడనీ, తనను చదివించి, భారీగా ఖర్చు పెట్టి పెళ్లి కూడా చేశాడనీ, ఇప్పుడు అదనపు కట్నం కోసం తనను హింసిస్తున్నారని మేనమామతో చెప్పలేనని మనీషా ఆవేదనకు గురయింది. పెళ్లయిన మూడు నెలల్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గురించి తెలిసిన మేనమామ మహేష్ కన్నీటిపర్యంతమయ్యాడు. మనీషా భర్త రాజేశ్, అతడి కుటుంబ సభ్యులపై కేసు పెట్టాడు. వ్యాపారం చేస్తున్నాడు కదా, కోడలి భవిష్యత్ బాగుంటుంది కదా అని పెళ్లి చేస్తే ఆమెను చిత్రహింసలకు గురిచేస్తాడని తాను ఊహించలేకపోయానని వాపోయాడు. తనకు ఫోన్ చేసి విషయం చెప్తే ఏదో ఒకటి చేసేవాడిని కదమ్మా అంటూ గుండెలు పగిలేలా ఏడ్చాడు.
    ఇది కూడా చదవండి: పెళ్లి తర్వాత సినిమాలు మానేయమని రాజీవ్ కండీషన్ పెట్టాడు.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన యాంకర్ సుమ
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Andhra Pradesh, Crime news, Crime story, CYBER CRIME, Hyderabad, Illegal affair, Love marriage

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు