హోమ్ /వార్తలు /క్రైమ్ /

Wedding gift: అక్కతో ఎఫైర్.. మరదలి పెళ్లికి ఊహించని సర్ ప్రైస్.. ఏంచేశాడో తెలుసా..?

Wedding gift: అక్కతో ఎఫైర్.. మరదలి పెళ్లికి ఊహించని సర్ ప్రైస్.. ఏంచేశాడో తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Gujarat: ఆమెతో ఎఫైర్ పెట్టుకున్నాడు . కొంత కాలం తర్వాత గొడవలు చోటు చేసుకున్నాయి. దీంతో అతడిని ఆమె దూరంగా పెట్టింది.

కొంత మంది యువత ప్రేమిస్తున్నామంటూ అమ్మాయిలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వారిని ప్రేమ పేరుతో (Love affair) అవసరాలకు వాడుకుని ఆపైన తప్పించుకుంటున్నారు. చాలా మంది ప్రేమించుకుంటారు. కానీ వారు పెళ్లిళ్ల వరకు తమ ప్రేమను తీసుకెళ్లలేక పోతున్నారు. దీంతో ఇష్టం లేని వారిని చేసుకొని జీవితాంతం బాధపడుతున్నారు. కొందరు ప్రేమకున్న (Love) గొప్ప తనాన్ని దిగజారుస్తున్నారు. ఒకరికి తెలియకుండా మరోకరితో ప్రేమాయణాలు నడిపిస్తున్నారు. లవ్ ను ఒక స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు.

కేవలం అవసరాల కోసం ప్రేమను (love affair) ఒక పావుగా వాడుకుంటున్నారు. ప్రేమ ముసుగులో అడ్డమైన తిరుగుళ్లు తిరుగుతున్నారు. కొందరు మాత్రమే నిజయితీగా ఉండి తమ ప్రేమను గెలిపించుకుంటున్నారు. కొందరు తమ ప్రేమను అంగీకరించలేదని, ప్రేమికులపై దారుణాలకు పాల్పడుతున్నారు. మరికొందరు ప్రేమించిన వారి కోసం ఎలాంటి త్యాగాలు చేయడానికైన వెనుకాడరు. కొందరు పెద్దలు కుల ప్రస్తావనతో తమ పిల్లల పెళ్లిళ్లు అంగీకరించడం లేదు.

మరికొందరు తమ కన్న హోదాలో, ఆస్తి పాస్తులలో తక్కువ అనుకుంటూ కూడా పెళ్లిళ్లను నిరాకరిస్తున్నారు. కొందరు పెళ్లి కి ముందే ఎఫైర్ లు పెట్టుకుంటూ పశువులకన్న హీనంగా ప్రవర్తిస్తున్నారు. సభ్యసమాజంలో నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఒక వేళ వీరిని దూరం పెడితే, ప్రేమించిన వారిని లేదా వారి బంధువులపై దాడులకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. గుజరాత్ లో (Gujarat)  దారుణమైన ఘటన వెలుగులోనికి వచ్చింది. నవ్ సారి జిల్లాకు చెందిన ఒక యువతి, కొయంబత్తురుకు చెందిన రాజు పటేల్ కి మధ్య పరిచయం ఏర్పడింది. ఇది కాస్త వివాహేతర సంబంధానికి (Affair)  దారితీసింది. ఈ క్రమంలో.. కొన్ని రోజుల తర్వాత వీరి మధ్య గొడవలు జరగటంతో రాజు పటేల్ ను యువతి దూరంగా పెట్టింది. దీంతో అతను కోపంతో రగిలిపోయాడు. కాగా, మింధబారి నగరంలో సదరు యువతి చెల్లెలి పెళ్లి (Marriage)  నిశ్చమైంది. యువతి పెళ్లి.. లతేష్ అనే వ్యక్తితో జరిగింది. కాగా, వీరి పెళ్లికి రాజు పటేల్ కూడా వచ్చాడు.

పెళ్లి తర్వాత.. గిఫ్ట్ లు  (Gift Explosion) ఓపేన్ చేసి చూస్తున్నారు. యువతి,మేనల్లుడు జియాన్ కొత్త జంటలకు వచ్చిన బహుమతులను సరదాగా తెరుస్తున్నాడు. ఒక గిఫ్ట్ లో అతను బొమ్మను చూశాడు. దాని రీచార్జ్ చేయడానికి ప్రయత్నించాడు. వెంటనే అది ఒక్కసారిగా పేలింది. దీంతో జియాన్, లతేష్ తీవ్రంగా గాయపడ్డారు. అతని తలకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. బాధితులు కాసేపటికి పేలుడుకు గల కారణాలపై ఆరా తీశారు. బహుమతి కవర్ ను రాజు పటేల్ ఇచ్చినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఆ యువతి పై కోపంతోనే చెల్లెలి పెళ్లిలో ఇలా చేసుంటాడని భావిస్తున్నారు.

First published:

Tags: Gifts, Gujarat, Wedding

ఉత్తమ కథలు