పెళ్లై మూడు రోజులే అయింది.. అప్పుడే వధూవరుల మధ్య గొడవలు.. కోపంతో ఆ భర్త ఏం చేశాడంటే..

ప్రతీకాత్మక చిత్రం

Telangana: పెళ్లై మూడు రోజులు కూడ కలేదు. అప్పుడే భార్యాభర్తల మధ్య గొడవ జరిగి.. నవ వరుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆమెతో ఉండలేనంటూ ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించాడు.

  • Share this:
పెళ్లై మూడు రోజులే అయింది. అనుకున్నట్లుగానే వివాహ వేడుక వైభవంగా జరగడంతో ఇరు కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి. బంధువులంతా వెళ్లిపోయారు. ఇంట్లో ప్రస్తుతం వధూవరుల కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు. పెళ్లి తంతు సజావుగా పూర్తవవడంతో ఇంటి పెద్దలు ప్రశాంతంగా ఉన్నారు. కానీ అంతలోనే వారి కుటుంబంలో ఊహించని ఘటన జరిగింది. భార్యాభర్తల మధ్య గొడవ జరిగి.. నవ వరుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆమెతో ఉండలేనంటూ ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించాడు. కత్తితో కోసుకోవడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. జగిత్యాలలోని మార్కండేయనగర్‌కు చెందిన బాబాకు మూడు రోజుల క్రితమే ఓ యువతితో పెళ్లి జరిగింది. కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సందడి మధ్య వివాహ వేడుక ఘనంగా నిర్వహించారు.

హాయిగా సాగిపోతున్న సంసారం.. ఆరేళ్ల కూతురిని విడిచి పెట్టి ఈ తల్లి ఏం చేసిందంటే..

ఐతే పెళ్లైన తర్వాత సంతోషంగా గడపాల్సిన ఆ జంటలో అప్పుడే విభేదాలు వచ్చాయి. కొత్త జీవితాన్ని ఆస్వాదించాల్సింది పోయి, కలహాలతో ఇరు కుటుంబాలను కలవరపెట్టారు. ఏం జరిగిందో తెలదయదు గానీ.. పెళ్లైన మరుసటి రోజు నుంచే వీరి మధ్య పొరపచ్చాలు వచ్చాయి. నిత్యం గొడవ పడుతున్నారు. ఈ విషయమై ఆ యువకుడు గురువారం జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భార్యపై ఫిర్యాదు చేశాడు. పెళ్లి జరిగి రెండు రోజులు కూడా జరగలేదు.. అప్పుడే గొడవలేంటని పోలీసులు ఆరా తీశారు. నలుగురిలో నవ్వుల పాలు కావొద్దని.. ఒకరినొకరు అర్థం చేసుకొని, సర్దుకుపోవాలని చెప్పారు. బుద్ధిగా కాపురం చేసుకోవాలని సూచించారు. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత భార్యాభర్తలు ఇంటికి వెళ్లారు. కనీసం ఇప్పుడైనా మంచిగా ఉంటారని కుటుంబ సభ్యులు అనుకున్నారు. కానీ అలా జరగలేదు. వారు మారలేదు. శుక్రవారం కూడా భార్యా భర్తల మధ్య గొడవ జరిగింది. ఇద్దరూ పరస్పరం దూషించుకున్నారు. మాటా మాటా పెరిగింది. నువ్వెంతంటే.. నువ్వెంత అని తిట్టుకున్నారు.

Sad: అయ్యో పాపం.. ఆమె ఎనిమిది నెలల గర్భిణి.. కన్నవారికి కన్నీటిని మిగిల్చి..

ఈ క్రమంలోనే తీవ్ర మనస్థాపానికి గురైన బాబా ఆత్మహత్యాయత్నం చేశాడు. ఓ పదునైన కత్తితో చెయ్యి, వీపు భాగాల్లో కోసుకున్నాడు. తీవ్ర గాయాలై రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాబా ఆరోగ్యం నిలకడగా ఉందని.. ప్రాణాపాయం ఏమీ లేదని చెప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అసలు భార్యాభర్తల మధ్య గొడవల కారణమేంటి? పెళ్లైన మూడు రోజులకే బాబా ఎందుకు ఆత్మహత్యాయత్నం చేశాడు? అంతగా వీరి మధ్య విభేదాలు ఏమున్నాయి? అనే వివరాలను పోలీసులు కూపీ లాగుతున్నారు. ఇరు కుటుంబాలను పిలిచి మాట్లాడుతున్నారు. ఐతే పెళ్లైన మూడో రోజే నవ వరుడు ఆత్మహత్యాయత్నం చేశాడన్న వార్త స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.
Published by:Shiva Kumar Addula
First published: