పెళ్లికి రెండేళ్ల ముందే అమ్మాయికి ఆ సంబంధం... ప్రియుడితో కలిసి

ఈనెల 21న మధ్యాహ్నం సూర్యనారాయణ అత్తవారింటి నుంచి కరపకు వచ్చి అదేరోజు సాయంత్రం తిరిగి వేపకాయపాలెం వెళ్లారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో బయటకు వెళ్తూ ఎనిమిదింటికల్లా తిరిగివస్తానని భార్యతో చెప్పిన ఆయన అప్పటి నుంచీ కనిపించకుండా పోయారు.

news18-telugu
Updated: May 31, 2019, 12:32 PM IST
పెళ్లికి రెండేళ్ల ముందే అమ్మాయికి ఆ సంబంధం... ప్రియుడితో కలిసి
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 31, 2019, 12:32 PM IST
ఈ మధ్య వివాహేతర సంబంధాలు నేపథ్యంలో చోటు చేసుకున్న నేరాల సంఖ్య ఎక్కువవైపోతున్నాయి. ప్రియుడి మోజులో పడి ఓ భార్య కూడ తన పండంటి కాపురాన్ని చేజేతులారా నాశనం చేసుకుంది. తనను నమ్మి పెళ్లి చేసుకున్న భర్తను అనంత లోకాలకు సాగనంపింది. తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఘటనే చోటుచేసుకుంది. కరప మండలంలో నవ వరుడి హత్య కేసు మిస్టరీని చేధించారు పోలీసులు. కట్టుకున్న భార్యే ప్రియుడితో కలిసి అతడ్ని హతమార్చిందన్న షాకింగ్ నిజాలు బయటపెట్టారు. పోలీసులు చెప్పిన కథనం ప్రకారం. తూర్పుగోదావరి జిల్లా కరపకు చెందిన పేకేటి సూర్యనారాయణకు 28 ఏళ్లు. ఎంఎస్సీ చదవి... మండపేటలోని శ్రీవికాస జూనియర్‌ కళాశాల్లో లెక్చరెర్‌గా పనిచేస్తున్నాడు. గ్రామంలో అతడికి మంచి పేరుంది. మే 15న కరప శివారు గ్రామం పేపకాయలపాలెం వాసి మద్దూరి వెంకటేశ్వరరావు కుమార్తె నాగలక్ష్మితో సూర్యనారాయణకు వివాహం జరిపింది. ఓ వారం పాటు అంతా ప్రశాంతంగానే ఉంది. ఆ తర్వాత అకస్మాత్తుగా రాత్రి ఇంటి నుంచి బయటకెళ్లిన సూర్యనారాయణ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసవారు అతని తల్లిదండ్రులు.

ఈకేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు... విచారణ ప్రారంభించారు. సూర్యనారాయణ అదృశ్యం వెనుక ఉన్న మిస్టరీ ని చేధించారు. భార్య నాగలక్ష్మీయే భర్త హత్యకు కారణమని తేల్చారు. నాగలక్ష్మీకి రెండేళ్ల ముందు నుంచే రాధాకృష్ణ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈనెల 21న మధ్యాహ్నం సూర్యనారాయణ అత్తవారింటి నుంచి కరపకు వచ్చి అదేరోజు సాయంత్రం తిరిగి వేపకాయపాలెం వెళ్లారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో బయటకు వెళ్తూ ఎనిమిదింటికల్లా తిరిగివస్తానని భార్యతో చెప్పిన ఆయన అప్పటి నుంచీ కనిపించకుండా పోయారు. కుటుంబ సభ్యులు సూర్యనారాయణ కోసం గాలించినా ఫలితం లేకపోయింది. కేసును విచారించిన పోలీసులు నాగలక్ష్మీ ప్రియుడు రాధాకృష్ణపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించటంతో నేరాన్ని అంగీకరించాడు. తమ వివాహేతర బంధానికి అడ్డులేకుండా సూర్యనారాయణను అంతంచేయాలని నాగలక్ష్మి కోరడంతోనే తానీ హత్య చేశానని రాధాకృష్ణ అంగీకరించాడు.

పార్టీ చేసుకుందామంటూ సూర్యనారాయణను పంటపొలం వద్దకు తీసుకెళ్లి అక్కడ అంతం చేశానని రాధాకృష్ణ చెప్పాడు. అతడి తలపై నరికి కిరాతకంగా హత్య చేసి గడ్డి కప్పి ఉంచాడు. ఈ క్రమంలో హత్య జరిగిన ఎనిమిది రోజుల్లో నేరాన్ని ఛేదించి నిందితులు రాధాకృష్ణ, నాగలక్ష్మిలను అరెస్టు చేశారు. హతుడి వద్ద దొంగిలించిన బంగారు ఆభరణాలు, కత్తి, మరో ఆయుధం గురువారం స్వాధీనం చేసుకున్నారు.

First published: May 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...