NEWLY MARRIED LADY BRUTALLY RAPED AND MURDERED BY EX LOVER IN ABSENCE OF HUSBAND IN BENGAL MS
భర్త లేని సమయంలో మాజీ ప్రేమికురాలిని పిలిపించి.. ఆమెను కసితీరా అనుభవించి.. ఆపై..
ప్రతీకాత్మక చిత్రం
ఇన్నాళ్లు తమతో తిరిగిన తమ ప్రేయసి లేదా ప్రేమికుడు.. ఇతరులతో కలిసి ఉండటాన్ని కలలో కూడా ఊహించలేరు. ఒంటరిగా ఉన్న మైండ్ లో ఏవేవో ఆలోచనలు. వారిని ఓ పట్టాన నిద్రపోనివ్వవు. దాంతో ఈ అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు.
ప్రేమకథల్లో చాలా మట్టుకు విషాదాంతాలే. ఈ విషాదాలను తట్టుకోని చాలా మంది ప్రేమికులు.. తమకు దక్కనిది వేరే వాళ్లకు దక్కకూడదనుకుంటారు. ఇన్నాళ్లు తమతో తిరిగిన తమ ప్రేయసి లేదా ప్రేమికుడు.. ఇతరులతో కలిసి ఉండటాన్ని కలలో కూడా ఊహించలేరు. ఒంటరిగా ఉన్న మైండ్ లో ఏవేవో ఆలోచనలు. వారిని ఓ పట్టాన నిద్రపోనివ్వవు. అప్పటిదాకా మందు అంటేనే ముట్టనోళ్లు.. సడెన్ గా దేవదాసులైపోతారు. బూతు సినిమా అంటేనే ఆమడదూరం పరిగెత్తేవాళ్లు.. దానికే బానిసలైపోతారు. ఆ క్రమంలో వారిలో నేర ప్రవృత్తి విచ్చలవిడిగా పెరిగిపోతుంది. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా.. బెంగాల్ లో ఓ యువకుడు తన మాజీ ప్రేయసిని.. ఒంటరిగా పిలిపించి.. ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అంతటితో ఆగకుండా.. ఆమెను హత్య చేశాడు.
ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బెంగాల్ లోని ముర్షిదాబాద్ జిల్లాలోని దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుందీ దారుణం. స్థానికంగా ఉంటున్న హసన్ షేక్.. అదే ఊరుకు చెందిన సంజిలా ప్రేమించుకున్నారు. కానీ పలు కారణాల రీత్యా వారి ప్రేమ మధ్యలోనే పెటాకులైంది. సంజిలాను ఆమె తండ్రి వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. గతేడాది పెళ్లి జరిగింది. అప్పట్నుంచి హసన్.. మనసు మనసులో ఉండటం లేదు. ఏం చేద్దామన్నా తోచడం లేదు.
సంజిలా భర్త కేరళలో ఉంటాడు. అతడొక వలస కూలీ. భర్త సంజిలాతో ఉండటం లేదని తెలుసుకున్న హసన్.. ఆమెను తన ఇంటికి రావలసిందిగా పిలిచాడు. దానికి ముందు ఆమె ఒప్పుకోలేదు. కానీ.. హసన్, తాను మాట్లాడాలనుకుంటున్నానని.. మాయ మాటలు చెప్పి.. చివరికి అనుకున్నది సాధించాడు. సంజిలా హసన్ ఇంటికెళ్లింది. ఇదే అదనుగా భావించిన హసన్.. ఆమెను గదిలో బంధించాడు. తనను ఏమీ చేయొద్దని.. తనకు పెళ్లి అయిందని చెప్పినా వినకుండా.. నిందితుడు వినిపించుకోలేదు. తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రేయసిని వేరే వ్యక్తి పెళ్లి చేసుకోవడాన్ని తట్టుకోలేకపోయిన హసన్.. ఆ కోపాన్నంతా సంజిలా మీద చూపించాడు. ఆమె వద్దని వారిస్తున్నా వినకుండా.. రేప్ చేశాడు. తన కామవాంఛ తీర్చుకున్నాడు.
నిందితుడు అంతటితో ఆగలేదు. సంజిలాను తనివి తీరా అనుభవించిన తర్వాత.. ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఆ పై ఆమె నగ్న మృతదేహాన్ని సమీపంలో ఉన్న అడవుల్లో పడవేశాడు. ఏమీ తెలియని వాడిలాగా వచ్చి.. ఇంట్లో కూర్చున్నాడు. అటుగా వెళ్లిన వ్యక్తి ఒకరు.. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. ఆ మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. ఈ హత్య కేసుపై లోతుగా విచారణ చేయగా.. నిందితుడు హసనే అని పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం హసన్ పరారీలో ఉన్నాడు. త్వరలోనే అతడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
Published by:Srinivas Munigala
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.