హోమ్ /వార్తలు /క్రైమ్ /

Crime: పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు.. రెండు నెలల తర్వాత ఏం జరిగిందంటే..?

Crime: పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు.. రెండు నెలల తర్వాత ఏం జరిగిందంటే..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని చిత్తూరు జిల్లా (Chittore District)లో ప్రేమజంట అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వారిది హత్యా, ఆత్మహత్యా అనేది పోలీసులు విచారిస్తున్నారు.

  వాళ్లిద్దరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నారు. హాయిగా కాపురం కూడా పెట్టారు. ఇంతలో ఏమైందో తెలియదు ఇద్దరూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందరు. చిత్తూరు జిల్లాలో కలకలం రేపిన ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా, రామకుప్పం మండలం, మణేంద్రం గ్రామానికి చెందిన మునిరత్నం, పావని ప్రేమించుకున్నారు. ప్రేమ విషయం పావని కుటుంబ సభ్యలకు తెలియడంతో ఆమెను ఇంట్లో బంధించారు. ఐతే రెండు నెలల క్రితం ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి మునిరత్నం తల్లిదండ్రులు అంగీకరించడంతో అతని ఇంట్లోనే కాపురం పెట్టారు. అంతా బాగానే ఉన్నా వారం రోజుల క్రితం పావని అదృశ్యమైంది.

  పావని కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మునిరత్నం కూడా అదృశ్యం కావడంతో అతడే తమ కుమార్తె ఏమైందో నిలదీసేందుకు అతని ఇంటిని ముట్టడించారు. ఇల్లంతా గాలిస్తుండగా.. ఇంటి సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో పావని శవం కనిపించింది. దీంతో మునిరత్నమే పావనిని మర్డర్ చేశాడని భావించి అతని ఇంటిని ధ్వంసం చేశారు. ఈ లోగా ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. పావనని మర్డర్ చేసి పారిపోయాడనుకున్న మునిరత్నం.. ఊరిచివర చెట్టుకు వేలాడుతూ కనిపించాడు.

  పోలీసులు అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికీ తమ కుమార్తెను మునిరత్నమే హత్య చేశాడని పావని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పావని మిస్సింగ్ పై ఈనెల 16 పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని..ఈనెల 19న కేసు నమోదు చేశారన్నారు. పోలీసులు ముందుగానే చర్యలు తీసుకొని ఉంటే తమ కుమార్తె చనిపోయి ఉండేది కాదంటున్నారు.

  ఐతే మునిరత్నం-పావని మృతి వెనక అనుమానాలు రేకెత్తుతున్నాయి. వీరివి హత్యలా లేక ఆత్మహత్యలా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే చేరో చోట ఎందుకు చనిపోవడమనేది అనుమానంగా మారింది. లేదంటే ఏదైనా గొడవ జరిగి మునిరత్నమే పావనని చంపి బావిలో పడేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడా..? అనేది తేలాల్సి ఉంది. ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు మృతుల ఫోన్ కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. అలాగే పెళ్లి చేసుకున్ననాటి నుంచి ఇద్దరి మధ్య విభేదాలొచ్చాయా..? ఎప్పుడైనా గొడవ పట్టారా..? పావని అదృశ్యమవడానికి ముందు ఏమైనా జరిగిందా? అనే కోణంలో మునిరత్నం తల్లిదండ్రులను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఇరు కుటుంబాలతో పాటు, చుట్టుపక్కలవారు, స్నేహితులను పోలీసులు విచారిస్తున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Chittoor, Crime, Love

  ఉత్తమ కథలు