Home /News /crime /

NEWLY MARRIED COUPLE FROM KUNIGAL TUMKUR DISTRICT TAKEN THESE DRASTIC STEP LEADS TO SAD END SSR

Newly Married: ఈ ఇద్దరికీ పెళ్లయి నాలుగు నెలలు.. ఇంతలోనే ఎవరైనా ఇలాంటి పనిచేస్తారా..

మునిస్వామి, వరలక్ష్మి

మునిస్వామి, వరలక్ష్మి

భార్యాభర్తల మధ్య చిన్నచిన్న మనస్పర్థలు రావడం సహజం. పెళ్లయిన కొత్తలో అంతా బాగున్నట్టుగానే అనిపించినా ఆ తర్వాత ఏదో ఒక విషయంలో భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తుతుంటాయి.

    తుమకూరు: భార్యాభర్తల మధ్య చిన్నచిన్న మనస్పర్థలు రావడం సహజం. పెళ్లయిన కొత్తలో అంతా బాగున్నట్టుగానే అనిపించినా ఆ తర్వాత ఏదో ఒక విషయంలో భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తుతుంటాయి. వాటిని దాటుకుని ముందుకెళితేనే వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతుంది. లేనిపక్షంలో ఆ కాపురంలో అశాంతి నెలకొంటుంది. నిత్యం దంపతుల మధ్య గొడవలు, మనస్పర్థల మూలంగా మనశ్శాంతి కోల్పోవడం లాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఆ పరిస్థితుల్లో క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల మూలంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇలాంటి ఘటనే కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో చోటుచేసుకుంది.

    భార్యాభర్తల మధ్య నెలకొన్న గొడవల కారణంగా ఆ జంట తీసుకున్న నిర్ణయం వారి నిండు నూరేళ్ల జీవితానికి ముగింపు పలికింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. తుమకూరు జిల్లా కునిగల్ తాలూకా కెంపసాగర్ గ్రామానికి చెందిన మునిస్వామి అనే 26 ఏళ్ల యువకుడు కునిగల్ పట్టణంలో కిరాణా దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ఇతని తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తున్నారు. మునిస్వామికి పెద్దలు పెళ్లి సంబంధాలు చూస్తుండగా అదే గ్రామానికి చెందిన ఓ యువతి కుటుంబంతో మంతనాలు నడిచాయి. ఆ యువతిని మునిస్వామికి ఇచ్చి పెళ్లి చేసేందుకు ఆమె కుటుంబం కూడా అంగీకారం తెలపడంతో నాలుగు నెలల క్రితం మునిస్వామికి, అదే గ్రామానికి చెందిన వరలక్ష్మి అనే 22 ఏళ్ల యువతికి వివాహం జరిగింది.

    ఇది కూడా చదవండి: Marriage: ఈ పెళ్లిళ్ల సీజన్‌లో ఎన్నో పెళ్లిళ్లు జరుగుతుండగా ఈ కొత్త జంట పెళ్లే ఎందుకు ప్రత్యేకమంటే..

    పెళ్లయి రెండు నెలల తర్వాత నుంచే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో.. వరలక్ష్మి అలకలు.. మునిస్వామి బుజ్జగింపులతో భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఏర్పడినా అది తాత్కాలికమే అయింది. ఏదో ఒక విషయంలో.. భార్యాభర్తల మధ్య గొడవలు రావడం.. ఇద్దరి ఒకరినొకరు తిట్టుకోవడంతో కొత్త కాపురం కాస్తా కలహాల కాపురంగా మారింది. మునిస్వామి, వరలక్ష్మి.. ఇద్దరిదీ ఒకే గ్రామం కావడంతో ఇరు కుటుంబాలు కలుగజేసుకుని భార్యాభర్తలకు నచ్చజెప్పి ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగాలని చెప్పేవారు. కానీ భార్యాభర్తల మధ్య గొడవలు మాత్రం ఆగలేదు. ఈ క్రమంలో శనివారం ఉదయం అదే గ్రామంలో ఉన్న తన పుట్టింటికి వరలక్ష్మి వెళ్లింది. మునిస్వామి రోజూ ఉదయం షాపు తీసేందుకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికొచ్చి భోజనం చేసి మళ్లీ షాపుకు వెళ్లేవాడు. రోజూలానే శనివారం కూడా ఇంటికొచ్చాడు. భార్య కనిపించకపోవడంతో తన అత్త ఇంటికి వెళ్లి ఉంటుందని భావించి అక్కడికి వెళ్లాడు. భార్యను భోజనం చేద్దామని ఇంటికి పిలిచాడు. ఇద్దరూ కలిసి బైక్‌పై ఇంటికెళ్లారు. భోజనం చేశారు. తర్వాత మునిస్వామి షాపుకెళ్లాడు.

    ఇది కూడా చదవండి: Shocking Incident: వామ్మో.. ఈ భార్యాభర్తలేంటి ఇలా ఉన్నారు.. ఇద్దరికి ఇద్దరు సరిపోయారు..

    మునిస్వామి తల్లిదండ్రులు పొలం పనుల నిమిత్తం ఉదయం వెళితే సాయంత్రానికి గానీ తిరిగి రారు. ఇంట్లో వరలక్ష్మి ఒక్కతే ఉంది. భర్తతో గొడవల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన వరలక్ష్మి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సాయంత్రం మునిస్వామి తల్లిదండ్రులు ఇంటికొచ్చి చూసేసరికి ఇంట్లో ఉరికి వేలాడుతూ కోడలు కనిపించాడు. దీంతో ఒక్కసారిగా షాకైన వారు ఇరుగుపొరుగును పిలిచారు. వరలక్ష్మి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మునిస్వామికి ఫోన్ చేసి వరలక్ష్మి ఉరేసుకుని చనిపోయిందని చెప్పారు. భార్య మరణ వార్త విని మునిస్వామి క్షణికావేశంలో కిరాణా దుకాణంలో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇలా వరలక్ష్మి, మునిస్వామిల కొత్త కాపురం విషాదాంతంగా ముగిసింది. పోలీసులు భార్యాభర్తల మధ్య నెలకొన్న విభేదాల కారణంగా ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్ధారించి కేసు నమోదు చేశారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Husband, Karnataka, Newly Couple, Suicide hanging, Wife

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు