HOME »NEWS »CRIME »newly married couple died in road accident in mancherial district su

Telangana: మరణంలోనూ వీడని బంధం.. పెళ్లైన ఆరు నెలలకే రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

Telangana: మరణంలోనూ వీడని బంధం.. పెళ్లైన ఆరు నెలలకే రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి
ప్రతీకాత్మక చిత్రం

పెళ్లైయిన ఆరు నెలలకే నవదంపతులు మృతిచెందారు. వివాహ బంధంతో ఒకటై జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ దంపతులను విధి చిన్నచూపు చూసింది.

  • Share this:
    పెళ్లైయిన ఆరు నెలలకే నవదంపతులు మృతిచెందారు. వివాహ బంధంతో ఒకటై జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ దంపతులను విధి చిన్నచూపు చూసింది. బైక్‌పై వెళ్తుండగా లారీ ఢీ కొట్టడంతో ఘటన స్థలంలో మరణించారు. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. మందమర్రి మండలం గద్దెరాగడి గ్రామానికి చెందిన రుద్ర రాజయ్య-పద్మ దంపతుల కుమారుడు సర్వాజ్‌కు(30), పెద్దపల్లి జిల్లా జయ్యారం గ్రామానికి చెందిన మామిడాల శంకరయ్య కుమార్తె కృష్ణవేణితో గతేడాది జూన్‌లో వివాహమైంది. పెళ్లి తర్వాత దంపతులు గద్దెరాగడిలోనే నివాసం ఉంటున్నారు. కొంతకాలం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన స్వరాజ్.. ప్రస్తుతం ఇంటివద్దే ఉంటున్నాడు. సింగరేణి ఉద్యోగం చేస్తున్న రాజయ్య.. మెడికల్ అన్‌ఫిట్ కావడంతో ఆ ఉద్యోగాన్ని స్వరాజ్‌కు పెట్టించాడు. ఇందుకు సంబంధించి స్వరాజ్ నెల రోజుల శిక్షణ కూడా పూర్తిచేసుకున్నాడు. మరో పదిహేను రోజుల్లో ఉద్యోగం చేరాల్సి ఉంది.

    మరోవైపు స్వరాజ్ భార్య కృష్ణవేణి మంచిర్యాలలో కుట్టు నేర్చుకుంటుంది. దీంతో ప్రతిరోజు స్వరాజ్ తన భార్యను బైక్‌పై మంచిర్యాలకు తీసుకొచ్చి.. శిక్షణ అయిపోయాక ఇంటకి తీసుకెళ్లేవాడు. సోమవారం కూడా స్వరాజ్, కృష్ణవేణిలు బైక్‌పై మంచిర్యాల నుంచి గద్దెరాగడికి బైక్‌పై బయలుదేరారు. అయితే మార్గమధ్యలో వారు ప్రయణిస్తున్న బైక్‌ను.. లారీ ఓవర్ టేక్ చేయబోయి బలంగా ఢీకొట్టింది. దీంతో స్వరాజ్, కృష్ణవేణిలు బైక్‌పై నుంచి కిందపడిపోయారు. తీవ్ర గాయాలు కావడంతో వారు ఘటన స్థలంలోనే చనిపోయారు.



    సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్వరాజ్ తండ్రి రాజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ ప్రమాదం జరిగిన తర్వాతర లారీ డ్రైవర్ పరారయ్యాడు. దీంతో పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నవదంపతుల మృతితో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి. మరోవైపు 15 రోజుల్లో ఉద్యోగంలో చేరాల్సిన స్వరాజ్ ఇలా మృత్యువాత పడటం స్థానికంగా విషాదాన్ని నింపింది.
    Published by:Sumanth Kanukula
    First published:January 19, 2021, 11:39 IST

    टॉप स्टोरीज