Telangana: అత్త వేధింపులు తాళలేక అల్లుడి ఆత్మహత్య... ఆస్పత్రిలో కూతురు

ప్రతీకాత్మక చిత్రం

పెద్దలను కాదని పెళ్లి చేసుకున్న ఆ జంటను ఇరు కుటుంబాలు ఓర్వలేదు. కానీ కనికరం చూపించినట్టు నటించిన వధువు తల్లి.. న‌వ‌దంప‌తుల‌కు ఆశ్ర‌యం క‌ల్పించేదుకు ముందుకొచ్చింది. కానీ ఆ ఇంటికి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి వారికి వేధింపులు మొదలయ్యాయి.

  • News18
  • Last Updated :
  • Share this:
    వారిద్దరూ ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి మూడుముళ్ల బంధంతో ఒక్క‌ట‌య్యారు. నూరేళ్ల జీవిత ప్రయాణాన్ని ప్రారంభించారు. కానీ ఈ పెళ్లిని కుటుంబసభ్యులు వ్యతిరేకించారు. అబ్బాయి త‌ర‌పు వారు కాద‌న్నారు. ముందు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చనిపోతామని బెదిరించారు. వారిని కాదని చేసుకుని వరుడు ఇంటికి వెళ్లగా.. వారు ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు. దీంతో న‌వ‌దంప‌తుల‌కు పెళ్లి కూతురు తల్లి ఆశ్ర‌యం క‌ల్పించేదుకు ముందుకొచ్చింది. కానీ ఆ ఇంటికి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి వారికి వేధింపులు మొదలయ్యాయి. మ‌న‌స్తాపం చేందిన కొత్త జంట‌ పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య య‌త్నం చేశారు. ఈ ఘటనలో భర్త మృతిచెందగా భార్య చికిత్స పొందుతుంది. కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.

    పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా కోటగిరి మండలం పోచారం కాలనీకి చెందిన సాయి ప్రణీత్, విజయ ప్రేమించుకున్నారు. ఇరుకుటుంబాల వారు పెళ్లికి అంగీకరించలేదు. అయినా నెల రోజుల‌ క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ సాయి ప్రణీత్ కుటుంబీకులు వారిని ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో తన వద్దే ఉండమని విజయ తల్లి సావిత్రి త‌న ఇంటికి తీసుకెళ్లారు.

    కూతురు, అల్లుడిని ఇంటికి తీసుకుపోయారు గానీ.. ఆపై వారిద్దరినీ సూటిపోటి మాటలతో ఇబ్బందులకు గురి చేసారు. దీంతో వారికి అసలు విషయం అర్థమైంది. తాము రెండు కుటుంబాలకు భారమయ్యారని అనుకున్నారు. ఈ వేధింపులకు బలవుతూ.. జీవితాన్ని ఈడ్చటం కంటే.. చనిపోవడమే ఉత్తమమని అనుకున్నారు. కుటుంబసభ్యులు పెట్టే వేధింపులు తాళలేక.. మనస్థాపానికి గురై ఆ జంట మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

    విషయం తెలుసుకున్న స్థానికులు.. ఆ దంపతులను ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కొసం నిజామాబాద్ జిల్లా ఆసుప‌త్రికి తీసుకు వ‌చ్చారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం ఉదయం సాయి ప్ర‌ణీత్ మృతిచెందాడు. విజయ ప‌రిస్థితి కొంత మెరుగైంది. మృతుడి జేబులో దొరికిన లేఖ‌లో త‌మ ఆత్మహత్యకు అత్త వేధింపులే కారణమని ఉంది. మృతుని తండ్రి గంగారం ఫిర్యాదు మేరకు అత్త‌ సావిత్రి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు...
    Published by:Srinivas Munigala
    First published: