పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం.. కొద్దిరోజులకే కొత్త జంట ఆత్మహత్య..

వివాహం జరిగిన కొద్దిరోజులకే ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడంతో నిషా గౌతమ్ తీవ్ర మనోవేదనకు గురయ్యింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు గౌతమ్‌ను ఓదార్చేందుకు ప్రయత్నించారు.

news18-telugu
Updated: July 5, 2020, 10:29 AM IST
పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం.. కొద్దిరోజులకే కొత్త జంట ఆత్మహత్య..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓ జంట పెద్దల అనుమతితో ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న కొద్ది రోజులకే ఆ నవదంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఘజియాబాద్‌కు చెందిన విశాల్ ప్రజాప్రతి అనే యువకుడు నిషా గౌతమ్‌లు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వారి బంధం విడిచి ఉండలేనంతగా మారడంతో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఏం జరిగిందో తెలియదు గానీ గురువారం విశాల్ ప్రజాప్రతి మెహ్రౌలి రైల్వే క్రాసింగ్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో మరుసటి రోజు గౌతమ్ తల్లిదండ్రులు ఆమెను అత్తగారింటి నుంచి కవినగర్‌లోని కైలాష్ పూరి కాలనీలోకి పుట్టింటికి తీసుకెళ్లారు. వివాహం జరిగిన కొద్దిరోజులకే ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడంతో నిషా గౌతమ్ తీవ్ర మనోవేదనకు గురయ్యింది.

దీంతో ఆమె కుటుంబ సభ్యులు గౌతమ్‌ను ఓదార్చేందుకు ప్రయత్నించారు. కానీ గౌతమ్ తన గదిలో రాత్రి సమయంలో పైకప్పుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Published by: Narsimha Badhini
First published: July 5, 2020, 10:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading