• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • NEWLY MARRIED BRIDE RUNS AWAY WITH CASH AND GOLD FROM HUSBAND HOUSE IN UTTARPRADESH MS

నెల క్రితమే పెళ్లి... నగదు, నగలుతో ఉడాయించిన నవ వధువు.. ఆచూకీ లేని అత్తమామలు

నెల క్రితమే పెళ్లి... నగదు, నగలుతో ఉడాయించిన నవ వధువు.. ఆచూకీ లేని అత్తమామలు

ప్రతీకాత్మక చిత్రం

భర్త, అత్తమామల దగ్గర మంచి మార్కులు కొట్టేసింది ఆ భార్య. ఆ ఇంటి వాళ్లు కోడలును ‘మా ఇంటి మహాలక్ష్మీ’ అనుకున్నారు. కానీ ఆ కోడలు మాత్రం.. ఆ ఇంట్లో ఉన్న మహాలక్ష్మీని తన వశం చేసుకుంది. ఉన్నదంతా ఊడ్చి అత్తగారింటి నుంచి ఉడాయించింది.

  • News18
  • Last Updated:
  • Share this:
    ఆమెకు కొత్తగా పెళ్లైంది. భర్తతో సఖ్యంగానే ఉంది. ఇంట్లో అత్తమామల దగ్గర తాను ఒక మంచి కోడలుగా నిరూపించుకోవాలని చూసింది. ఆ ప్రయత్నాలు విజయవంతమయ్యాయి. భర్త దగ్గర కూడా మంచి మార్కులు కొట్టేసింది. ఇంకేం.. ఆ ఇంటి వాళ్లు కోడలును ‘మా ఇంటి మహాలక్ష్మీ’ అనుకున్నారు. కానీ ఆ కోడలు మాత్రం.. ఆ ఇంట్లో ఉన్న మహాలక్ష్మీని తన వశం చేసుకుంది. ఉన్నదంతా ఊడ్చి అత్తగారింటి నుంచి ఉడాయించింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నగదు, బంగారు ఆభరణాలతో అత్తగారి ఇంటి నుంచి పరారైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.

    వివరాల్లోకెళ్తే... ఉత్తరప్రదేశ్ లోని షమ్లి జిల్లాలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. షమ్లి జిల్లాలోని సింబక్లా గ్రామానికి చెందిన పింకు కి బగ్పట్ కు చెందిన యువతి తో గత నెల 25న పెళ్లి జరిగింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహానికి.. ఇద్దరి తరఫున కుటుంబసభ్యులు హాజరయ్యారు. భార్యాభర్తలిద్దరి మధ్య సఖ్యత బాగానే ఉంది. కానీ ఏమైందో ఏమో తెలియదు గానీ ఇంతలో ఊహించని కుదుపు.

    ఈనెల 26 న ఆమె ఉన్నట్టుండి ఇంటి నుంచి పరారైంది.  ఆమెతో పాటు ఇంట్లో ఉన్న రూ. 70 వేల నగదు, బంగారు ఆభరణాలను కూడా ఎత్తుకెళ్లింది. ఉదయం లేచి చూసే సరికి  ఆ భర్త, అత్తమామలకు మైండ్ బ్లాక్ అయింది. ఆమెకు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ రావడంతో.. అతడు సరాసరి అత్తగారింటికి కాల్ చేశాడు. అక్కడ కూడా ఎవరూ రెస్పాండ్ కాలేదు.  అయితే.. తాను ఆమె తల్లిదండ్రుల ఇంటి వద్దకు వెళ్లి వెతకగా.. అక్కడ వాళ్లు కూడా లేరని పింకు ఆరోపిస్తున్నాడు. అత్తమామల ఆచూకీ కూడా లేదని.. వీళ్లంతా పథకం ప్రకారమే తనను మోసం చేశారని పింకు వాపోతున్నాడు. పింకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
    Published by:Srinivas Munigala
    First published:

    అగ్ర కథనాలు