Home /News /crime /

NEWBORN DAUGHTER THROWN FROM 3RD FLOOR IN BANSWARA DEAD BODY FOUND HEART WRENCHING MURDER INCIDENT IN RAJASTHAN SK

ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టిందనుకుంటారు..కానీ వీళ్లు మాత్రం మూడో ఫ్లోర్ నుంచి విసిరేసి చంపేశారు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రాజస్థాన్‌లో గిరిజనులు అధికంగా ఉండే బన్స్వారా జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కూతురు పుట్టగానే ఇంటి మూడో అంతస్తు నుంచి విసిరేసి చంపేశారు.

    ఆడపిల్ల పుడితే సాక్షాత్తు లక్ష్మీ దేవే ఇంటికొచ్చిందని చాలా మంది సంతోషడపడతారు. కూతురు పుట్టిన ఇంట్లో అన్నీ శుభాలే జరుగుతాయని విశ్వసిస్తారు. కానీ నాణేనికి ఇది ఒకవైపు మాత్రమే..! ఇంకొందరు మాత్రం ఆడపిల్ల పుడితే.. తమ ఇంట్లో కష్టాలు మొదలయినట్లుగా ఫీలవుతుంటారు. అసలు ఆడపిల్ల వద్దు.. మగ పిల్లాడే కావాలని.. పూజలు చేసే వారు కూడా ఉంటారు. అంతేకాదు అబ్బాయి కోసం నాటు మందులు కూడా తింటుంటారు. ఇన్ని చేశాక కూడా.. ఒకవేళ ఆడపిల్ల పుడితే.. ఆ పసిబిడ్డను చంపేందుకు కూడా వెనకాడరు. పురిట్లోనే ఆడ శిశువును గొంతు నులిమిన ఘటనలు ఎన్నోసార్లు టీవీలు పేపర్లలో చూశాం. తాజాగా రాజస్థాన్‌ (Rajasthan)లో ఇలాంటి ఘోరమే జరిగింది. ఓ నవజాత ఆడశిశువును మూడో అంతస్తు నుంచి విసిరేసి చంపేశారు.

    తల్లి చనిపోయిన 8 నెలలకు ఇల్లు శుభ్రం చేయడానికి వెళ్లిన సోదరులు.. ఆ తర్వాత బయటికి రాలేదు..

    రాజస్థాన్‌లో గిరిజనులు అధికంగా ఉండే బన్స్వారా జిల్లాలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కూతురు పుట్టగానే ఇంటి మూడో అంతస్తు నుంచి విసిరేసి చంపేశారు. నవజాత శిశువు మృతదేహాన్ని చూసిన ఇరుగుపొరుగు వారు ... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నవజాత శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఐతే ఆ పాప ఎవరి బిడ్డ? ఎవరు చంపారు? ఎందుకు చంపాల్సి వచ్చిందన్న వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బన్స్వారాలోని పృథ్వీగంజ్ ప్రభుత్వ పాఠశాల వెనుక ఓ నవజాత శిశువు మృతదేహం స్థానికులకు కనిపించింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఆ మృతదేహం.. అప్పుడే పుట్టిన ఓ ఆడపిల్లదని గుర్తించారు. కొన్ని గంటల ముందే ఆ పాప జన్మిచిందని రాజ్‌తలాబ్ అవుట్‌పోస్ట్ ఇన్‌ఛార్జ్ రఘువీర్ సింగ్ తెలిపారు. సమీపంలోని ఓ ఇంటి మూడో అంతస్తు నుంచి కిందకు (newborn daughter thrown from 3rd floor) విసిరేసినట్లు అనుమానిస్తున్నారు.

    వరుసగా ఐదుగురు ఆడపిల్లలు.. భార్య నా వల్ల కాదన్న వినలేదు.. ట్విస్ట్ ఏంటంటే..

    ఈ దారుణానికి ఎవరు ఒడిగట్టారన్నది తెలియాల్సి ఉంది. పృథ్వీగంజ్‌లో నివాసముంటున్న రామచంద్ర  ఫిర్యాదు మేరకు పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. సమీపంలోని ఓ ఇంటి మూడో అంతస్తు పైకప్పుపై కూడా కొన్ని రక్తపు జాడలు కనిపించాయని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచే నవజాత శిశువును విసిరేసి (New born girl killed) ఉంటారని పోలీసులు చెబుతున్నారు. నవజాత శిశువును సజీవంగా విసిరివేశారా లేదా చనిపోయిన తర్వాత విసిరివేసారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఆ భవనంలో ఉన్న వారిని అడితే.. తమకు ఏమీ తెలియదని అంటున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని.. పోలీసులు తెలిపారు. కాగా, రాజస్థాన్‌లో ఇలాంటి ఘటనలు ఇటీవల ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. అప్పుడే పుట్టిన ఆడపిల్లను అడవిలో వదిలేసి.. బావిలో పడేసిన ఘటనలు కూడా తెరపైకి వచ్చాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Crime, Crime news, Rajasthan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు